Weekly Horoscope in Telugu: 09-07-2023 To 15-07-2023 - Sakshi
Sakshi News home page

Weekly Horoscope in Telugu: ఈ రాశివారికి వారం మధ్యలో గుడ్‌న్యూస్‌.. ఇంటాబయటా మీదే పైచేయి

Published Sun, Jul 9 2023 6:45 AM

Weekly Horoscope Telugu 09-07-2023 To 15-07-2023 - Sakshi

మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆలోచనలు కలసివస్తాయి.  చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. బంధువులను కలుసుకుని కుటుంబ విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం.

వృషభం: ఉద్యోగాలలో  విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు మరింత  అనుకూల సమయం.  వారం  మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. కొన్ని పనులు నత్తనడకన సాగుతాయి. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యభంగం.  బంధువులతో విభేదాలు. కుటుంబంలో ఒత్తిడులు తప్పవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. లాభాలు  స్వల్పంగా అందుతాయి. ఉద్యోగాలలో  విధి నిర్వహణలో ఆటంకాలు ఎదుర్కొంటారు.రాజకీయవర్గాలు, కళాకారులకు అందిన అవకాశాలు నిరాశ పరుస్తాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. నూతన పరిచయాలు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

మిథునం: చేపట్టిన పనులు అనుకున్న సమయానికి  సజావుగా సాగుతాయి. ఆర్థికంగా బలం చేకూరుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకువస్తాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులవుతారు. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలలో మరింత లాభాలు దక్కుతాయి. విస్తరణ యత్నాలు సాగిస్తారు. ఉద్యోగాలలో   సంతోషం కలిగించే సమాచారం అందుతుంది. పారిశ్రామికవర్గాలకు  విదేశీ పర్యటనలు సాగిస్తారు. వారం చివరిలో ఆస్తి వివాదాలు. శ్రమాధిక్యం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో  అనుకున్న లాభాలు దక్కుతాయి. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో  మరింత చురుగ్గా వ్యవహరిస్తారు.. రాజకీయవర్గాలకు కొత్త పదవులు లభిస్తాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. పనులు చకచకా సాగుతాయి ఆస్తి వివాదాలు పరిష్కారం. కొన్ని వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. పాతబాకీలు వసూలవుతాయి. చిరకాల కోరిక నెరవేరుతుంది. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభం. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల విస్తరణయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. విధి నిర్వహణలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు  ఊహించని విధంగా  అవకాశాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం.  తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య: ఉత్సాహం, పట్టుదలతో ఎంతటి పనినైనా పూర్తి చేస్తారు. ఆత్మీయులు సహకరిస్తారు. గృహం, వాహనాలు కొంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు ముందుకు సాగుతారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహంతో అడుగువేస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొత్త అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వారం చివరిలో అనుకోని ధనవ్యయం. మానసిక అశాంతి. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

తుల: కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. పెట్టుబడుల యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం లభిస్తుంది.  రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఫలప్రదమవుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విద్యార్థుల నైపుణ్యత వెలుగులోకి వస్తుంది. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు వెన్నుదన్నుగా నిలుస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహన, గృహయోగాలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాల విస్తరణయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో విధి నిర్వహణలో ఆటుపోట్లు తొలగుతాయి. కళాకారులకు అనుకున్న విజయాలు సా«ధిస్తారు. వారం ప్రారంభంలో బంధువిరో«ధాలు. ఆరోగ్యభంగం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. పనులు వేగంగా పూర్తి చేస్తారు. కొన్ని వివాదాల పరిష్కారానికి చొరవ చూపుతారు. విద్యార్థులు ప్రతిభను చాటుకునేందుకు తగిన సమయం. బంధువులను కలుసుకుని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబంలో వేడుకలు నిర్వహిస్తారు. భూములు, వాహనాలు కొంటారు.  వ్యాపార  లావాదేవీలు కొంత ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో  చిక్కులు, చికాకులు తొలగుతాయి. అయితే పనిభారం పెరుగుతుంది. రాజకీయ, పారిశ్రామివర్గాల అంచనాలు నిజమవుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. మనశ్శాంతి లోపిస్తుంది. అనారోగ్యం. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మకరం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన  విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ప్రతిభాపాటవాలకు తగిన గుర్తింపు పొందుతారు. కొత్త ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో  మరింత అనుకూల సమయం. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. కళాకారులకు రెండుమూడు అవకాశాలు దగ్గరకు వస్తాయి. వారం చివరిలో మిత్రులతో వివాదాలు. అనారోగ్య సూచనలు.దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి..

కుంభం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సమాజంలో  గౌరవమర్యాదలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలలో  కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కుతాయి. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు దక్కుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్య సూచనలు. బంధువులతో తగాదాలు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

మీనం: కొత్త పనులు  చేపడతారు. ఇంటాబయటా మీదే పైచేయిగా నిలుస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. బంధువులతో సంబంధబాం«ధవ్యాలు మెరుగుపడతాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. విద్యార్థుల సత్తా వెలుగులోకి వస్తుంది. కాంట్రాక్టర్లకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అనుకున్న విధంగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కుతాయి. రాజకీయవర్గాల యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.


 

Advertisement
Advertisement