Weekly Horoscope: ఈ రాశుల వారికి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. | Weekly Horoscope Telugu 14-04-2024 To 20-04-2024 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope: ఈ రాశుల వారికి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.

Published Sun, Apr 14 2024 6:07 AM | Last Updated on Sun, Apr 14 2024 7:17 AM

Weekly Horoscope Telugu 14-04-2024 To 20-04-2024 - Sakshi

మేషం
నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఆరోగ్యసమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో కొన్ని సర్దుబాట్లు జరుగుతాయి. కళాకారులకు అనుకోని అవకాశాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యుల నుండి ఒత్తిడులు. చాక్లెట్, ఎరుపు రంగులు,  శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి. 

వృషభం
కొత్తగా అప్పులు చేస్తారు. బంధువులు,స్నేహితులతో అకారణంగా తగాదాలు. దేవాలయాలు సందర్శిస్తారు. కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలకు చికాకులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. నేరేడు, లేత ఎరుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం
అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సోదరులతో మనస్పర్థలు తొలగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహం. వారం చివరిలో ఆరోగ్యం సహకరించదు. వృథా ఖర్చులు. తెలుపు, ఎరుపు రంగులు, ఆంజనేయ దండకం పఠించండి.

కర్కాటకం
అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీ సత్తా చాటుకుని అందరిలోనూ గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులు సమర్థతను చాటుకుని మరింత గుర్తింపు పొందుతారు.  రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువర్గం నుండి సమస్యలు. పసుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. 

సింహం
అనుకున్న ఆదాయం సమకూరుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని వివాదాల పరిష్కారం. కుటుంబంలో శుభకార్యాలు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు పట్టింది బంగారమే. వారం మధ్యలో వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. పసుపు, గులాబీరంగులు,  వినాయకుని పూజించండి.

కన్య
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్వల్ప అనారోగ్యం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు కొన్ని హామీలు లభిస్తాయి. వారం చివరిలో అనారోగ్యం. మానసికంగా ఆందోళన. నలుపు, ఆకుపచ్చ రంగులు, కనకధారాస్తోత్రం పఠించండి.

తుల
కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.  కొత్త కాంట్రాక్టులు చేపడతారు. వ్యతిరేకులు సైతం అనుకూలంగా మారతారు.  వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళాకారులు సాధించాలనుకున్న అవకాశాలు పొందుతారు. వారం ప్రారంభంలో ఆప్తులతో కలహాలు. రుణయత్నాలు. లేత ఆకుపచ్చ, గులాబీ రంగులు, గణేశాష్టకం పఠించండి.

వృశ్చికం
చేపట్టిన కార్యక్రమాలలో విజయం. ఆదాయం పెరుగుతుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంటర్వ్యూలు అందుతాయి.  భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం.  ఉద్యోగులకు ఉన్నత స్థాయి పొందుతారు. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు కలుగుతాయి. వారం ప్రారంభంలో దుబారా వ్యయం. కష్టానికి ఫలితం రాదు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, శివాష్టకం పఠించండి.

ధనుస్సు
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. శుభవార్తా శ్రవణం. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి విముక్తి. భూసంబంధిత వివాదాల పరిష్కారం. దేవాలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు కొంత బాధ్యతలు తగ్గవచ్చు. రాజకీయవేత్తలకు కొంత ఊరటనిచ్చే సమాచారం రావచ్చు. వారం మధ్యలో దూరప్రయాణాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, తెలుపు రంగులు, విష్ణుధ్యానం చేయండి.

మకరం
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి. అందరిలోనూ గుర్తింపు. కొన్ని వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. స్థలాలు, వాహనాలు కొంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. సోదరుల నుంచి శుభవర్తమానాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.  కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో బంధువర్గంతో తగాదాలు. మానసిక అశాంతి.  నీలం, నేరేడు రంగులు,  అంగారకస్తోత్రం పఠించండి.

కుంభం
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల చేయూతతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. శుభకార్యాల నిర్వహణ. కోర్టు వ్యవహార ం ఒకటి అనుకూలంగా పరిష్కారం. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఒక ముఖ్యమైన పోస్టు రావచ్చు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో లేనిపోని వివాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మీనం
విద్యార్థుల యత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళాకారులకు కొత్త అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. నీలం, లేత పసుపు రంగులు, వారం ప్రారం¿¶ ంలో దుబారా వ్యయం. ఆరోగ్య, కుటుంబసమస్యలు. దుర్గాస్తోత్రాలు పఠించండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement