ఈ రాశి వారికి వారం మధ్యలో శుభవార్త, ధనలాభం | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి వారం మధ్యలో శుభవార్త, ధనలాభం

Published Sun, Feb 18 2024 6:57 AM

Weekly Horoscope Telugu 18-02-24 To 24-02-24 - Sakshi

మేషం..
ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు. మిత్రులు, కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొనే అవకాశం. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం ఆకుపచ్చ, లేత నీలం రంగులు, దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

వృషభం..
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో కలహాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు,  శివపంచాక్షరి పఠించండి.

మిథునం..
ముఖ్యమైన కొన్ని పనులు అనుకున్నరీతిలో పూర్తి కాగలవు. ఆలోచనలు కలసివస్తాయి. విద్యార్థుల యత్నాలు సాఫీగా సాగుతాయి. నూతన ఉద్యోగప్రాప్తి. కుటుంబసౌఖ్యం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వాహనయోగం. తీర్థయాత్రలు చేస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆస్తి వివాదాలు. ఎరుపు, లేత పసుపు రంగులు,  దేవీస్తుతి మంచిది.

కర్కాటకం..
పనుల్లో కొంత జాప్యం జరిగినా చివరికి పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఇతరులకు సాతం సాయం అందిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఇంటిలో శుభకార్యాల నిర్వహిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు సమస్యల నుండి విముక్తి. రాజకీయవర్గాలకు సన్మానయోగం. వారం చివరిలో ధనవ్యయం. బంధువిరోధాలు.  గులాబీ, చాక్లెట్‌ రంగులు,  ఆదిత్య హృదయం పఠించండి.

సింహం..
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు. వస్తులాభాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగులకు కొంత పనిభారం తప్పదు. కళాకారులకు నిరుత్సాహం. వారం మధ్యలో వ్యయప్రయాసలు. అనారోగ్యం.  ఆకుపచ్చ, తెలుపురంగులు, దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కన్య..
ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఇంటాబయటా అనుకూల పరిస్థితి.  నేర్పుగా ఎదుటవారిని ఆకట్టుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గి ఊరట లభిస్తుంది. రాజకీయవర్గాలకు నిర్ణయాలలో సందిగ్ధత తొలగుతుంది. ఆశ్చర్యకరమైన వార్తలు అందుతాయి. వారం  ప్రారంభంలో కుటుంబంలో ఒత్తిడులు. ధనవ్యయం.  నీలం, చాక్లెట్‌ రంగులు, హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

తుల..
పనులు నిదానంగా పూర్తి చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. భూవివాదాలు పరిష్కారమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కొంతకాలంగా వేధిస్తున్న సమస్య పరిష్కారం. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కళాకారుల యత్నాలలో పురోగతి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు.
 ఎరుపు, పసుపు రంగులు,  ఆంజనేయదండకం పఠించండి.

వృశ్చికం..
అనుకున్న కార్యక్రమాలు కొంత నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశాజనకంగా ఉంటుంది. దూరపు బం«ధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం. ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగస్తులకు ఊహించని బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి.  వారం మధ్యలో అనారోగ్యం. బంధువిరోధాలు గులాబీ, తెలుపు రంగులు,  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు..
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. భూవివాదాలు పరిష్కారం. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. కాంట్రాక్టులు పొందుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. మీ సలహాలు కుటుంబసభ్యులను ఆకట్టుకుంటాయి.  పేరుప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు శ్రమ ఫలించి హుషారుగా పనిచేస్తారు.  కళాకారులకు చికాకులు తొలగుతాయి. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యల పసుపు, నేరేడు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.

మకరం..
పనులు సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూ, గృహయోగాలు కలుగుతాయి. గతంలో చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసమస్యలు లేత ఎరుపు, చాక్లెట్‌రంగులు,హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కుంభం..
దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు, వివాదాలు తొలగుతాయి. కళాకారులకు మంచి గుర్తింపు రాగలదు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. కుటుంబంలో సమస్యలు. లేత ఎరుపు, ఆకుపచ్చ రంగులు.  గణేశాష్టకం పఠించండి.

మీనం..
యత్నకార్యసిద్ధి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆదాయం పెరుగుతుంది. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులకు ప్రయత్నాలు కలసివస్తాయి. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులకు ఆమోదయోగ్యంగా ఉంటాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. కళాకారులకు అవార్డులు. వారం మధ్యలో ఆలోచనలు స్థిరంగా సాగవు. వ్యయప్రయాసలు. మిత్రులతో మాటపట్టింపులు. తెలుపు, చాక్లెట్‌రంగులు,  లక్ష్మీస్తుతి మంచిది.

Advertisement
Advertisement