Weekly Horoscope in Telugu: 23-07-2023 To 29-07-2023 - Sakshi
Sakshi News home page

Weekly Horoscope: ఈ రాశి వారు వారం మధ్యలో శుభవార్త వింటారు, డబ్బు చేతికి అందుతుంది

Published Sun, Jul 23 2023 6:53 AM | Last Updated on Sun, Jul 23 2023 10:26 AM

Weekly Horoscope Telugu 23-07-2023 To 29-07-2023 - Sakshi

మేషం..
ఎటువంటి సమస్య ఎదురైనా మనోనిబ్బరంతో అధిగమిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వ్యతిరేకులు కూడా మీపట్ల సానుభూతి వ్యక్తం చేస్తారు.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల వ్యవహారాలలో నెలకొన్న ఇబ్బందులు తీరతాయి. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు సంతోషకర సమాచారం రావచ్చు. పారిశ్రామికవేత్తలకు విచిత్రమైన రీతిలో వ్యవహారాలు పూర్తి కాగలవు. వారం ప్రారంభంలో అప్పులు చేస్తారు. ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించండి. ఎరుపు, తెలుపు రంగులు. దేవీస్తోత్రాలు పఠించండి.

వృషభం..
పొరపాట్లు సరిదిద్దుకుని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం మరింత మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలలో కదలికలు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు భాగస్వాముల సహకారం అందుతుంది.  ఉద్యోగస్తులకు విధుల్లో ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. గులాబీ, ఎరుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

మిథునం..
సమస్యలకు ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొండి, విజయం సాధిస్తారు. పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆర్థిక విషయాలు మునుపటి కంటే కొంత నయం కావచ్చు. రుణబాధల నుండి విముక్తి. సమాజంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ప్రముఖులు పాల్గొనే సమావేశాలకు పిలుపు రావచ్చు. ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుని లాభాల బాట పడతారు. ఉద్యోగస్తులకు ఊరటనిచ్చే విషయాలు తెలుస్తాయి. కళాకారులకు ఉన్నత పురస్కారం రావచ్చు. వారం మధ్యలో వృథా ఖర్చులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. తెలుపు, నేరేడు రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం..
ఎంతటి కార్యాన్ని తలపెట్టినా స్వయంగా పూర్తి చేస్తారు. ఇతరులు సాయమందిస్తామని ముందుకు వచ్చినా సున్నితంగా తిరస్కరిస్తారు. బంధువులతో గతంలో నెలకొన్న వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. రాబడి విషయంలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. సంఘసేవా కార్యక్రమాలు చేపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మీ యత్నాలు కలసివచ్చి లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత పోస్టులు దక్కే ఛాన్స్‌. పారిశ్రామికవర్గాలకు కృషి ఫలించే సమయం. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

సింహం..
ఏ కార్యక్రమమైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి మరింత ఆదరణ లభిస్తుంది. కుటుంబంలో నిర్వహించే వేడుకలపై పెద్దలతో చర్చలు జరుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. శారీరక రుగ్మతల నుండి ఉపశమనం పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు భాగస్వాములతో సర్దుబాట్లు చేసుకుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతలు కొంత తగ్గుముఖం పట్టవచ్చు. పారిశ్రామికవేత్తలకు  ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో ఆస్తి వివాదాలు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. గులాబీ, నేరేడు రంగులు.  ఆంజనేయ దండకం పఠించండి.

కన్య..
వ్యతిరేకులు కూడా మీరంటే ఇష్టపడతారు. మీ అభిరుచులు, ఆలోచనలపై బంధువులు సైతం మెచ్చుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలకు గతం నుండి వేధిస్తున్న ప్రధాన సమస్యల తీరుతుంది. వారం ప్రారంభంలో దుబారా ఖర్చులు. శారీరక రుగ్మతలు. నేరేడు, తెలుపు రంగులు. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

తుల..
ఎంతటి వారినైనా నైపుణ్యంతో ఆకట్టుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలను సజావుగా పూర్తి చేస్తారు. చిరకాల ప్రత్యర్థులను కూడా మీకు అనుకూలురుగా మలచుకుంటారు.  ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలు కుటుంబంలో కొంత మార్పు తేవచ్చు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి లబ్ధి పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు మరింత లాభదాయకమైన కాలం. ఉద్యోగులకు  ముఖ్య సమాచారం అందుతుంది. రాజకీయవర్గాలకు క్లిష్ట సమస్యలు తీరతాయి. వారం మథ్యలో దూరప్రయాణాలు. మనశ్శాంతి లోపిస్తుంది. చేసే పనుల్లో ఏకాగ్రత లోపిస్తుంది. గులాబీ, పసుపు రంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం..
అనుకున్న కార్యక్రమాలను శ్రమతో  పూర్తి చేస్తారు. ఆత్మీయులతో అకారణంగా విరోధాలు నెలకొంటాయి. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం మంచిది.  ప్రయాణాలలో మార్పులు లేదా రద్దు కాగలవు. . దూరపు బంధువుల రాక కొంత సంతోషం కలిగిస్తుంది. ఆదాయ కొంత తగ్గి అవసరాలకు అప్పులు చేస్తారు.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు కొద్దిపాటి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు అదనపు విధులు భారంగా మారవచ్చు.  కళారంగం వారికి లేనిపోని సమస్యలు ఎదురవుతాయి.  వారం మధ్యలో  శుభవార్తలు. వాహనయోగం. నేరేడు, గులాబీ రంగులు.  లక్ష్మీగణపతి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు..
ముఖ్యమైన కార్యక్రమాలు సమయానికి పూర్తి కాగలవు. ఆదాయం మరింత మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. శత్రువులను కూడా ఆకర్షిస్తారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు ఒత్తిడుల నుంచి విముక్తి లభిస్తుంది. కళారంగం వారి ఆశలు ఫలించే సమయం. వారం మధ్యలో శారీరక రుగ్మతలు. కుటుంబంలో చికాకులు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి.

మకరం..
కొన్ని సమస్యలను పట్టుదల, ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. బం«ధువులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలుతో అవసరాలు తీరతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు ఉంటాయి. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారులు అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులకు అవకాశం. పారిశ్రామికరంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో దుబారా ఖర్చులు. శారీరక రుగ్మతలు. నలుపు, ఆకుపచ్చ రంగులు.  నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కుంభం..
మొదట్లో కొన్ని ఈతిబాధలు ఎదురైనా అ«ధిగమిస్తారు. పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహవంతంగా గడుపుతారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. మీ నిర్ణయాలు బంధువులను ఆకట్టుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు శుభవార్తలు. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. మానసిక అశాంతి. శ్రీకృష్ణాష్టకం పఠించండి.

మీనం..
ఆదాయపరంగా అవసరాలకు ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. స్నేహితులతో వివాదాలు సర్దుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి.  వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులకు ఊహించని ఫలితాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారులకు అ«ధిక లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. రాజకీయవేత్తలకు సమస్యలు కొన్ని తీరతాయి. వారం మధ్యలో దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఎరుపు, పసుపు రంగులు.  గణేశాష్టకం పఠించండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement