ఈ రాశి వారు వారం మధ్యలో శుభవార్త వింటారు, ధనలాభం | Weekly Horoscope Telugu 24-09-2023 To 30-09-2023 | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారు వారం మధ్యలో శుభవార్త వింటారు, ధనలాభం

Published Sun, Sep 24 2023 7:08 AM | Last Updated on Sun, Sep 24 2023 9:57 AM

Weekly Horoscope Telugu 24-09-2023 To 30-09-2023 - Sakshi

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
మరింత రాబడి పొందుతారు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీ సత్తా చాటుకుని అందరిలోనూ గుర్తింపు పొందుతారు. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. విద్యార్థులకు ముఖ్య సమాచారం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి, విస్తరించే యత్నాలు సఫలం. ఉద్యోగులు విధుల్లో సమర్థతను చాటుకుంటారు.  రాజకీయవర్గాలకు విదేశీయానం. వారం ప్రారంభంలో వృథా వ్యయం.  పసుపు, నేరేడు రంగులు, విష్ణుధ్యానం చేయండి. 

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
శుభవార్తా శ్రవణం. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి విముక్తి. భూసంబంధిత వివాదాల పరిష్కారం. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. వాహనయోగం.  వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో మనశ్శాంతి లోపిస్తుంది. ఆకుపచ్చ, తెలుపు రంగులు, లక్ష్మీనృసింహ స్తోత్రాలు పఠించండి.

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొన్ని వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. స్థలాలు, వాహనాలు కొంటారు. వేడుకలలో పాల్గొంటారు. సోదరుల నుంచి శుభవర్తమానాలు. నిరుద్యోగుల దీర్ఘకాలిక కృషి ఫలిస్తుంది.  సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు, వి«ధుల్లో అవాంతరాలు తొలగుతాయి.  కళాకారులకు మరిన్ని అవకాశాలు రావచ్చు. వారం మధ్యలో దుబారా వ్యయం. అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు, అంగారకస్తోత్రం పఠించండి.

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. ఆదాయం పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు చేపడతారు. విద్యార్థుల శ్రమ ఫలించే సమయం. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణ ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయవర్గాలకు కొన్ని పదవులు దక్కే అవకాశం. వారం చివరిలో దూరప్రయాణాలు. మానసిక ఒత్తిడులు. ధనవ్యయం. లేత ఆకుపచ్చ, గులాబీ రంగులు,  గణేశాష్టకం పఠించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. భూములు వాహనాలు కొంటారు. ఉన్నత హోదాలలోని వారిని కలుసుకుంటారు.  వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.  వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. సోదరులతో కలహాలు. నలుపు, ఆకుపచ్చ రంగులు, కనకధారాస్తోత్రం పఠించండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
చేపట్టిన పనుల్లో  విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం మరింత  కుదుటపడుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి.  భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కి మరింత ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగులకు ఉన్నత స్థాయి విధులు నిర్వహించే అవకాశం. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, శివాష్టకం పఠించండి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
విద్యార్థుల యత్నాలు కలసివస్తాయి.  పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూవివాదాల నుంచి ఎట్టకేలకు గట్టెక్కుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారవృద్ధి, భాగస్వాములతో వివాదాలు సర్దుకుంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. ప్రయాణాలు రద్దు. మానసిక ఆందోళన. నీలం, లేత పసుపు రంగులు, దుర్గాస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితిలో గందరగోళం. కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు. ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగుల శ్రమ అంతగా ఫలించదు, సర్దుబాటుతో ముందడుగు వేయాలి. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలకు చికాకులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు.  వాహనయోగం. నేరేడు, లేత ఎరుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
 ప్రముఖులతో పరిచయాలు. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఆరోగ్యసమస్యలు కొంత కుదుటపడతాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా కొనసాగి, లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు ఒక  ముఖ్య సమాచారం రావచ్చు. కళాకారులకు అనుకోని అవకాశాలు దగ్గరకు వస్తాయి. వారం చివరిలో శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. వారం  చాక్లెట్, ఎరుపు రంగులు, శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి. 

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అనుకున్న ఆదాయం సమకూరుతుంది.  విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని వివాదాల పరిష్కారం. కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు పట్టింది బంగారమే. వారం ప్రారంభంలో ఖర్చులు పెరుగుతాయి.  పసుపు, గులాబీరంగులు, దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆదాయం సమకూరడంలో అవాంతరాలు తొలగుతాయి. అనుకున్న వ్యవహారాలు పూర్తి చేసేవరకూ విశ్రమించరు. వాహనాలు, భూములు కొనుగోలుపై ఉన్న సందిగ్ధత తొలగుతుంది.   విద్యార్థులకు నూతన అవకాశాలు. వ్యాపారాలు మునుపటి కంటే మెరుగుపడతాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో అనారోగ్యం. శ్రమ తప్పదు. గులాబీ, లేత ఎరుపు రంగులు,  నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు  లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. రాజకీయవర్గాలకు పర్యటనలు విజయవంతంగా ముగుస్తాయి. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. తెలుపు, ఎరుపు రంగులు, ఆంజనేయ దండకం పఠించండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement