ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.. | Weekly Horoscope Telugu 25-01-2025 To 01-02-2025 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Published Sun, Jan 26 2025 12:05 AM | Last Updated on Sun, Jan 26 2025 7:29 AM

Weekly Horoscope Telugu 25-01-2025 To 01-02-2025

మేషం...
కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రులు, బంధువులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వాహనాలు, భూములు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులు పరిచయం కాగలరు. ఒక సమాచారం మరింత ఊరటనిస్తుంది. వ్యాపారాలలో సమస్యలు తీరి లాభాలబాటలో పడతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. దత్తాత్రేయుని స్తోత్రాలు పఠించండి.

వృషభం...
అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు ఎదురుకావచ్చు. ఆత్మస్థైర్యం, పట్టుదలతో ముందుకు సాగండి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. నిర్ణయాలలోనూ ఆచితూచి వ్యవహరించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో  పాల్గొంటారు. ఇంటి నిర్మాణాలు వాయిదా వేస్తారు. కుటుంబబాధ్యతలపై కొంత విముఖత చూపుతారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింతగా ఒత్తిడులు. పారిశ్రామికవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం చివరిలో శుభవార్తలు. చిన్ననాటి మిత్రుల కలయిక. తెలుపు, పసుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం....
మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. అయినా పట్టుదలతో అధిగమిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారంపై చర్చలు జరుపుతారు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. కళారంగం వారికి అనుకోని సన్మానాలు, రివార్డులు దక్కుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. కాలభైరవాష్టకం పఠించండి.

కర్కాటకం...
అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులకు విజయాలు చేకూరతాయి. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉండి రుణాలు తీరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యతిరేకులు కూడా మీకు సహకరించడం విశేషం. వాహనయోగం. అందరిలోనూ మీ సత్తా చాటుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు ఫలిస్తాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. బంధువులతో వివాదాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

సింహం....
ముఖ్య వ్యవహారాలు ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మొదట్లో కొంత ఇబ్బందికరంగా ఉన్నా క్రమేపీ పుంజుకుంటుంది. సన్నిహితులు, బంధువులతో ముఖ్యమైన విషయాలపై ^è ర్చిస్తారు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వివాహయత్నాలు కలసివస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో తగినంతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహం. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. ధనవ్యయం. పసుపు, నేరేడు రంగులు.  శివాష్టకం పఠించండి.

కన్య.....
ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినా సర్దుబాటు చేసుకుంటారు.∙పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆత్మీయులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు మన్నిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు సానుకూల వాతావరణం. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు మిశ్రమంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. కళారంగం వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

తుల....
ఆర్థిక ఇబ్బందులు ఎదురై కొంత చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బంధువులతో అకారణంగా తగాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విద్యార్థుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలలో లాభాలు కష్టసాధ్యమే. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు నిర్వíß స్తారు. రాజకీయవర్గాలకు పర్యటనల్లో మార్పులు. వారం ప్రారంభంలో శుభవార్తలు. ధన,వస్తులాభాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. నీలం, తెలుపు రంగులు.  శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం...
ఎంత శ్రమకోర్చినా అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. మిత్రులు, శ్రేయోభిలాషులు సైతం ఒత్తిడులు పెంచుతారు. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం కాస్త ఊరటనిస్తుంది. విద్యార్థులు అవకాశాలు చేజారి నిరాశ చెందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాల విషయంలో అప్రమత్తంగా మెలగండి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురుకావచ్చు. కళారంగం వారికి గందరగోళంగా ఉంటుంది.  వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

ధనుస్సు...
ఎంతటి పనైనా చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యతిరేక పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు. లక్ష్మీస్తుతి మంచిది.

మకరం...
పనులు కొంత మందగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్యపరంగా చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు, పనిభారం. రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ధనలబ్ధి. ఎరుపు, గులాబీ రంగులు.  హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కుంభం...
ఆర్థిక విషయాలలో గందరగోళం తొలగుతుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. మీపై వచ్చిన ఆరోపణల నుంచి బయటపడతారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి.  వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. కళారంగం వారికి అవకాశాలు మరింతగా దక్కుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మీనం...
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తుల వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. సేవాకార్యక్రమాలను చేపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు అరుదైన సన్మానాలు జరుగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. నీలం, నేరేడు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement