
మేషం..
ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగించినా క్రమేపీ అనుకూలిస్తాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు నూతనోత్సాహం. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు విశేష ఆదరణ లభించవచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
వృషభం..
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల చేయూతతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. శుభకార్యాల నిర్వహణ. ఒక దీర్ఘకాలిక కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం. కీలక సమావేశాలలోపాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు వివాదాలు తీరే సమయం. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. గులాబీ, ఎరుపు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.
మిథునం..
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు నూతనోత్సాహం. పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త పదవులు ఊరిస్తాయి. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. గులాబీ, నేరేడు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
కర్కాటకం..
ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. అనుకున్న విధంగా డబ్బు అందుతుంది. అరుదైన ఆహ్వానాలు రాగలవు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంటి నిర్మాణాలు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఆశ్చర్యకరమైన రీతిలో అవకాశాలు లభిస్తాయి. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. తెలుపు, గులాబీ రంగులు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.
సింహం..
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వాహనయోగం. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. ఆస్తి వివాదాలు. అనుకోని ప్రయాణాలు. పసుపు, నేరేడు రంగులు. సూర్యారాధన చేయండి.
కన్య..
కొత్త పనులకు శ్రీకారం. వేడుకల్లో పాల్గొంటారు. పాతబాకీలు సైతం వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధి. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు, సోదరులతో ఆనందంగా గడుపుతారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. పారిశ్రామికరంగం వారికి ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో కుటుంబంలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. రుణయత్నాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. శివస్తోత్రాలు పఠించండి.
తుల..
ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. అనుకోని ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో వివాదాలు నెలకొంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు తథ్యం. రాజకీయవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. వారం మధ్యలో విందువినోదాలు. వాహన యోగం. స్థిరాస్తివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఎరుపు, నీలం రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం..
పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. సోదరులు, మిత్రులతో నెలకొన్న వివాదాలు తీరతాయి. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పరపతి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత తగ్గుతాయి. రాజకీయవర్గాలకు సామాన్యంగా ఉంటుంది. వారం చివరిలో మానసిక ఆందోళన. కొన్ని నిర్ణయాలు వాయిదా. శ్రమ మరింత పెరుగుతుంది. ఆకుపచ్చ. పసుపు రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
ధనుస్సు..
కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. చిరకాల మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. భూములు, వాహనాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి, అలాగే, విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనారోగ్యం. విష్ణుధ్యానం చేయండి.
మకరం..
ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. ఆశ్చర్యకమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా సాగిపోతుంది. వారం చివరిలో ఆస్తి వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. నీలం,పసుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.
కుంభం..
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు.ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుని ఉల్లాసంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు. పారిశ్రామికరంగం వారికి కొన్ని సంస్థలతో ఒప్పందాలు. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. పనులలో ఆటంకాలు. శివాష్టకం పఠించండి.
మీనం..
నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉండి అప్పులు తీరుస్తారు. ఇంటాబయటా అనుకూలస్థితి. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు పనిభారం నుండి విముక్తి. రాజకీయవర్గాలకు కొన్ని విజయాలు చేకూరతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. మానసిక అశాంతి. గణేశాష్టకం పఠించండి.
Comments
Please login to add a commentAdd a comment