Weekly Horoscope Telugu: February 26 To March 4, 2023 - Sakshi
Sakshi News home page

Weekly Horoscope Telugu: ఈ రాశి వారు వారమంతా ఫుల్ హ్యాపీ.. ఆశ్చర్యకరమైన సంఘటనలు

Published Sun, Feb 26 2023 6:53 AM | Last Updated on Sun, Feb 26 2023 11:31 AM

Weekly Horoscope Telugu 26-02-2023 To 04-03-2023 - Sakshi

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికరంగం వారికి సన్మానయోగం. వారం చివరిలో అనారోగ్యం. పనులలో ఆటంకాలు. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహనాలు, గృహ కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. ఆశ్చర్యకమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు విధులు ఉత్సాహంగా సాగుతాయి. రాజకీయవర్గాలకు ప్రోత్సాహం. వారం ప్రారంభంలో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. తెలుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తుతి మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. పాతబాకీలు వసూలై ఆర్థికాభివృద్ధి ఉంటుంది. సన్నిహితులు, సోదరులతో ఆనందంగా గడుపుతారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. వ్యాపారాలలో లాభాలు మీ ఊహలకు అందవు. ఉద్యోగాలలో సంతోషకరమైన వార్తలు. పారిశ్రామికరంగం వారికి ఆహ్వానాలు రాగలవు.వారం చివరిలో మానసిక ఆందోళన. కొన్ని అంచనాలలో పొరపాట్లు. గులాబీ, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. 

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు నూతనోత్సాహం. సన్నిహితుల నుంచి ధనలాభం.  స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.  కళారంగం వారికి ఊహించని అవకాశాలు దక్కుతాయి. వారం  చివరిలో ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ముఖ్యమైన పనులను ఎటువంటి శ్రమ లేకుండా పూర్తి చేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. శుభకార్యాల నిర్వహణ పై నిర్ణయాలు. కోర్టు వ్యవహార ం ఒకటి పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో లేనిపోని  వివాదాలు. అనారోగ్యం. మనశ్శాంతి లోపిస్తుంది. గులాబీ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్ర ధ్యానం చేయండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగించినా క్రమేపీ అనుకూలిస్తాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు నూతనోత్సాహం. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ కృషి ఫలించి ప్రశంసలు అందుకుంటారు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. శ్రమ తప్పకపోవచ్చు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
పనులు కొంత నెమ్మదిగా కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. ఒక ప్రకటనతో విద్యార్థుల్లో నూతనోత్సాహం. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. వ్యాపారాలలో తగినంతæ లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి కొంత విముక్తి. రాజకీయవర్గాలకు సామాన్యంగా గడుస్తుంది. వారం మధ్యలో సోదరులతో కలహాలు. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఉత్సాహంగా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. అనుకున్న విధంగా డబ్బు సమకూరుతుంది.  ఇంటి నిర్మాణాలకు  సన్నాహాలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉండి ఊరటనిస్తాయి. ఉద్యోగాలలో మీ పనితీరుపై పైస్థాయి వారు సంతృప్తి చెందుతారు. పారిశ్రామికరంగం వారికి ఉత్సాహం పెరుగుతుంది. వారం చివరిలో అనారోగ్యం. ఎరుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీనృసింహమహామంత్రం పఠించండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  సమాజంలో మీ సేవలకు గుర్తింపు రాగలదు.  కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వాహనయోగం. ఎంతటి పనినైనా తేలిగ్గా చక్కబెడతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారాలలో పురోగతి మరింత కనిపిస్తుంది. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. కళారంగం వారికి సన్మానయోగం. వారం చివరిలో అనుకోని ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
మీ ఆత్మవిశ్వాసం పెంచుకుని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.  వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులకు అవకాశం. రాజకీయవేత్తలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. భూములు, వాహనాలు కొంటారు. స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ సహనం, నేర్పు ఎంతో సహకరిస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. కళారంగం వారికి అన్ని విధాలా సానుకూలత ఉంటుంది. వారం మధ్యలో వ్యయప్రయాసలు. గులాబీ, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. మీ సహనం ప్రస్తుతం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త చిక్కులు.  రాజకీయవేత్తలు  వివాదాల్లో చిక్కుకుంటారు. వారం మధ్యలో విందువినోదాలు. వాహన యోగం. స్థిరాస్తివృద్ధి. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement