Weekly Horoscope: ఈ రాశి వారు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు.. | Weekly Telugu Horoscope On Mar 31st To Apr 7th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu - Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ రాశి వారు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు..

Published Sun, Mar 31 2024 6:46 AM | Last Updated on Wed, Apr 3 2024 6:53 AM

Weekly Horoscope Telugu 31-03-2024 To 07-04-2024 - Sakshi

మేషం 
ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. ప్రముఖులు మరింత సాయపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. వాహనయోగం. సోదరులతో ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది.  వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువుల నుండి ఒత్తిడులు. అనారోగ్యం.  ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు.  దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

వృషభం
అవసరాలకు తగినంతగా డబ్బు సమకూరుతుంది. ∙వ్యవహారాలు మరింత సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలపై ఒక నిర్ణయానికి వస్తారు.  బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక సమాచారం నిరుద్యోగులకు వరంగా మారనుంది. వాహనాలు, భూములు కొంటారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ సత్తా నిరూపించుకుంటారు. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో మానసిక ఆందోళన. కుటుంబసమస్యలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు.  హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

మిథునం
నూతనోత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు దక్కుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మీ నిర్ణయాలపై కుటుంబసభ్యుల నుండి అనుకూలత లభిస్తుంది. భూ వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుండి ఊహించని పిలుపు రావచ్చు. ఆశ్చర్యరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు అన్ని విధాలా సానుకూలత లభిస్తుంది. వారం చివరిలో  దూరప్రయాణాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కర్కాటకం
నూతన ఉద్యోగాలను దక్కించుకుంటారు. ముఖ్య వ్యవహారాలలో విజయమే. ఒక ముఖ్య వ్యక్తిని కలుసుకుని చర్చలు జరుపుతారు. ఆప్తులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. సోదరులతో వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారాలు వృద్ధిబాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. రాజకీయవేత్తలకు ఎనలేని గౌరవం లభిస్తుంది. వారం చివరిలో అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యుల ద్వారా ఒత్తిడులు. గులాబీ, పసుపు రంగులు. గణేశ్‌స్తోత్రాలు  పఠించండి.

సింహం
 కొత్త కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటారు. కొన్ని సమస్యల నుంచి బయపడతారు. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీపై అందరికీ ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు.  విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు కొన్ని నిజం కాగలవు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ప్రయాణాలు. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కన్య
ఆర్థిక పరిస్థితి మందగించినా అవసరాలకు ఇబ్బందిరాదు. బంధువులతో వివాదాలు తీరి సఖ్యత నెలకొంటుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.  మీ ప్రతిభను గుర్తిస్తూ పురస్కారాలు రావచ్చు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు సజావుగా నడిపిస్తారు. ఉద్యోగులకు అంచనాలు నిజం కాగల అవకాశం. రాజకీయవేత్తలకు విశేష ఆదరణ లభిస్తుంది. వారం మధ్యలో లేనిపోని ఖర్చులు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి.  నీలం, లేత పసుపురంగులు, గణపతి అర్చనలు చేయండి.

తుల
ఇంటి ఖర్చులు పెరిగి రుణాల కోసం యత్నిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. మనస్సు చంచలంగా ఉంటుంది. మిత్రులతో మాటపట్టింపులు. కొన్ని నిర్ణయాలలో సర్దుబాట్లు చేసుకుంటారు.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. అయితే పట్టుదలతో పరిష్కారానికి కృషి చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అవకాశాలు చేజారే సూచనలు. వ్యాపారాలలో వేగం తగ్గి నిరాశ చెందుతారు. ఉద్యోగాలలో పని ఒత్తిడులు పెరిగి కొంత అసంతృప్తి చెందుతారు. రాజకీయవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవర్తమానాలు. ధనలబ్ధి. వాహనయోగం. ఆకుపచ్చ, నీలం రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృశ్చికం
ఆర్థిక ఇబ్బందుల నుంచి  బయటపడతారు. ఒక సమస్య ఎట్టకేలకుæ పరిష్కారమవుతుంది. అత్యంత నేర్పుగా వ్యవహారాలు చక్కదిద్దుతారు.  సోదరులు, సోదరీలతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, భూములు సమకూర్చుకునే పనిలో నిమగ్నమవుతారు.. చిన్ననాటి సంఘటనలను నెమరువేసుకుంటారు. వ్యాపారాలలో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు.ఉద్యోగులకు అనుకోని మార్పులు లాభిస్తాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. వారం చివరిలో దూరప్రయాణాలు. మానసిక అశాంతి. చాక్లెట్, ఆకుపచ్చరంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు
ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు చికాకు పరుస్తాయి. అయితే నేర్పుగా పరిష్కరించుకుంటారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలించే సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు ఫలితాలు ఆశ్చర్యపరుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలను సజావుగా కొనసాగిస్తారు. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. ఎరుపు, చాక్లెట్‌రంగులు, శివాష్టకం పఠించండి.

మకరం
కొన్ని వ్యవహారాలలో∙జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. సోదరులు, బంధువుల ద్వారా కీలక విషయాలు తెలుస్తాయి. అపరిష్కృతంగా ఉన్న వివాదాలు కొలిక్కి వస్తాయి. మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది.  వ్యాపారాలలో తగినంత లాభాలు రాగలవు. ఉద్యోగులకు పనిఒత్తిడులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు.  పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక  విదేశీ పర్యటనలు. వారం చివరిలో శ్రమ పెరుగుతుంది. వృథా ఖర్చులు. గులాబీ, పసుపురంగులు, ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం
కొన్ని వ్యవహారాలలో ప్రతిబంధకాలను తొలగించుకుని ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆర్థిక లావాదేవీలపై సంతృప్తి చెందుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనసౌఖ్యం. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు పెట్టుబడులు పెంచుకుని విస్తరిస్తారు. ఉద్యోగులకు కీలక  సమాచారం అందుతుంది. రాజకీయవర్గాలకు ఊహించని పిలుపు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. చాక్లెట్, ఆకుపచ్చరంగులు, కనకధారాస్తోత్రం పఠించండి.

మీనం
తెలివిగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక విషయాలు మీ అంచనాలకు తగినట్లుగా ఉంటాయి. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తుల కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు రాగలవు. వేడుకలలో పాలుపంచుకుంటారు. వ్యాపారాలను లాభాలబాటలో నడిపిస్తారు. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. కళారంగం వారికి శుభవార్తలు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. ఎరుపు, నేరేడురంగులు, దుర్గాస్తోత్రాలు పఠించండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement