తెనాలి: ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విశ్రాంత ఆచార్యుడు, దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి పరిశోధక గురువుగా చేసిన సేవలు ప్రశంసనీయమని ప్రముఖ రచయిత, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ విశ్రాంత ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు. స్థానిక చెంచుపేట డొంకరోడ్డులోని ఆచార్య కృపాచారి నివాసానికి శుక్రవారం ఆచార్య ఇనాక్ వచ్చారు. పరిశోధక గురు పేరుతో కొలకలూరి పురస్కారాన్ని ప్రదానం చేసి సత్కరించారు. మాట్లాడుతూ తాము ఏటా ప్రదానం చేస్తున్న కొలకలూరి పురస్కారాలను రచయితలతోపాటు పరిశోధకులు, పరిశోధక గురువుకు కూడా అందజేస్తున్నామని గుర్తుచేశారు. ఈ ఏడాది ప్రకటించిన అవార్డుల్లో పరిశోధక గురు అవార్డుకు కృపాచారిని ఎంపిక చేశామని తెలిపారు. అయితే ఆరోగ్య కారణాలతో హైదరాబాద్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ సభకు కృపాచారి హాజరుకాలేకపోయారని చెప్పారు. అందుచేత తానే స్వయంగా తెనాలి వచ్చి కృపాచారికి ఈ పురస్కారాన్ని అందజేసినట్టు ఆచార్య ఇనాక్ వివరించారు. కృపాచారి పర్యవేక్షణలో 75 మంది పీహెచ్‌డీలు, 68 మంది ఎంఫిల్ చేసినట్టు గుర్తుచేశారు. పలు విశ్వవిద్యాలయాకు 45 పాఠ్యగ్రంథాలను అందించారనీ, పలు అవార్డులను స్వీకరించారని గుర్తుచేశారు. పురస్కారం స్వీకరించటంపై కృపాచారి తన సంతోషాన్ని ప్రకటించారు.
Breadcrumb
- HOME
ఆచార్య కృపాచారికి పరిశోధక గురు పురస్కారం
Mar 22 2025 2:04 AM | Updated on Mar 22 2025 2:03 AM
Advertisement
Related News By Category
-
బాపట్ల
ఆదివారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2025పనులు లేని సమయంలో పేదలకు పని కల్పించి ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులోకి తెచ్చింది. అయితే కొంతమంది ప...
-
సాగునీటి కాలువల్లో అవినీతి పూడిక
సాక్షి ప్రతినిధి, బాపట్ల: నగరం మండలం అద్దంకివారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని వీరాస్వామి పిల్లలు రేష్మా 13 సంవత్సరాలు (8వ తరగతి,) హారిక 11 సంవత్సరాలు (7వ తరగతి) గూడవల్లి భారతి పాఠశాలలో చదువుతున్నారు. ...
-
ప్రజల ప్రాణాలతో చెలగాటం
బల్లికురవ: గ్రానైట్ లారీలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. మితిమీరిన వేగం, అనుభవలేమితో ఎక్కడ ఎప్పుడు ఎలా ఢీ కొడతారోనని వాహన చోదకులు, పాదచారులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. బల్...
-
ఫిరాయింపుదారులకే పగ్గాలు
చీరాల: ‘పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని.. పక్క పార్టీలో నుంచి టీడీపీలోకి వచ్చిన వారి కంటే పార్టీనే నమ్ముకున్న వారికి న్యాయం చేస్తాం’ అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు...
-
పులిచింతలకు 20,077 క్యూసెక్కులు విడుదల
సత్రశాల (రెంటచింతల): సత్రశాల వద్ద కృష్ణానదిపై నిర్మితమైన నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రెండు యూనిట్ల నుంచి, రెండు క్రస్ట్‌గేట్ల ద్వారా మొత్తం 20,077 క్యూసెక్కులు దిగువనున్న పులిచి...
Related News By Tags