నేడు కలెక్టరేట్‌ వద్ద ఫ్యాప్టో నిరసన | - | Sakshi

నేడు కలెక్టరేట్‌ వద్ద ఫ్యాప్టో నిరసన

Apr 2 2025 1:27 AM | Updated on Apr 2 2025 1:27 AM

నేడు కలెక్టరేట్‌ వద్ద  ఫ్యాప్టో నిరసన

నేడు కలెక్టరేట్‌ వద్ద ఫ్యాప్టో నిరసన

బాపట్ల: ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలకు గండికొట్టి ఇబ్బందులకు గురి చేయటాన్ని నిరసిస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టినట్లు ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ శేఖర్‌బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 12వ వేతన సవరణ, వెంటనే 30 శాతం ఐఆర్‌ను ప్రభుత్వం ప్రకటించాలని నిరసన తెలియజేస్తున్నామని తెలిపారు. సాయంత్రం నాలుగుగంటలకు నిరసన కార్యక్రమం ఉంటుందని, ఉద్యోగ, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

ఘనంగా రెడ్డి పేరంటాలమ్మ తల్లి ఆలయ పండుగ

నాదెండ్ల: మండలంలోని సాతులూరు గ్రామంలో కొలువైయున్న రెడ్డిపేరంటాలమ్మ తల్లి ఆల య ప్రతిష్ట నిర్వహించి మంగళవారం నాటికి పదహారు రోజులు పూర్తయిన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు పలువురు పీటలపై కూర్చుని పూజలు, అభిషేకాలు చేశారు. అమ్మవారికి పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించా రు. కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర, చక్కెర పొంగలి, మజ్జిగ, తాగునీరు పంపిణీ చేశారు. భక్తులకు గోత్రనామ పూజలు నిర్వహించారు. ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ వజ్జా వీరాంజనేయులు, జంపని లక్ష్మీనారాయణ, తమ్మ సీతయ్య, చెన్నబోయిన వెంకటసుబ్బారావు, వజ్జా రామారావు, నర్రా శ్రీనివాసరావు, గొర్రె సాంబశివరావు, ఈదర పూర్ణచంద్రరావు, ఈదర కోటయ్యస్వామి పర్యవేక్షించారు.

వారంలోపు రీసర్వే పూర్తి చేయండి

జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌

ధనుంజయ్‌ గనోరే

నరసరావుపేట: జిల్లాలో 25 పైలట్‌ ప్రాజెక్టు గ్రామాల్లో నిర్వహిస్తున్న భూముల రీసర్వే వారం రోజుల్లోగా పూర్తిచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ గనోరే అధికారులను ఆదేశించారు. వాస్తవ భూ హక్కుదారుల సమాచారాన్ని సర్వేలో నమోదైన వివరాలను సరిచేసి గ్రౌండ్‌ ట్రూతింగ్‌ పూర్తిచేయాలన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో రెవెన్యూ, సర్వే, పౌర సరఫరాల శాఖల అధికారులతో జాయింట్‌ కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం రెండో దశ గ్రామాల ఎంపిక పూర్తిచేసి గ్రామ సరిహద్దులు నిర్ణయించే కార్యక్రమం ప్రారంభించాలన్నారు. రేషన్‌ కార్డుదారుల ఈ–కేవైసీ వెంటనే పూర్తిచేయాలన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి నారదముని, ఆర్డీఓ మధులత, సర్వే ఏడీ భానుకీర్తి, తహసీల్దార్‌ వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

వైద్యసిబ్బంది పోస్టుల మెరిట్‌ లిస్టు విడుదల

గుంటూరు మెడికల్‌:గుంటూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయం పరిధిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మాసిస్టు, డీఈఓ, ఎల్‌జీఎస్‌, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారి ఫైనల్‌ మెరిట్‌ లిస్టును విడుదల చేసినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. ఫైనల్‌ మెరిట్‌ లిస్టును గుంటూరు.ఏపీ.జీవోవి.ఇన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. ఫైనల్‌ మెరిట్‌లిస్టులో ఆర్వోఆర్‌ ప్రకారం ఎంపికై న అభ్యర్థులకు కౌన్సిలింగ్‌ తేదీ తెలియజేస్తామని, వారు మాత్రమే ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.

ఏపీ పీ సెట్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ఏఎన్‌యూ(గుంటూరు): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళాశాలలో డీపీఈడీ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఏపీ పీ సెట్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైందని ఏపీ పీ సెట్‌ కన్వీనర్‌ ఆచార్య పి.పి.ఎస్‌.పాల్‌ కుమార్‌ తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి జూన్‌ 7వ తేదీతో గడువు ముగుస్తుందన్నారు. రూ.వెయ్యి ఆలస్య రుసుముతో జూన్‌ 11వ తేదీ వరకు, రూ.రెండువేల ఆలస్య రుసుముతో జూన్‌ 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఏపీ పీ సెట్‌ దేహదారుఢ్య పరీక్షలు జూన్‌ 23వ తేదీ నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతాయని పీ సెట్‌ కన్వీనర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement