
చీరాల క్రీడాకారుల ప్రతిభ
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో
చీరాల రూరల్: రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో చీరాల క్రీడాకారులు విశేష ప్రతిభచూపించారు. తమ ప్రత్యర్థులను పదునైన పంచ్‌లతో బెంబేలెత్తించి అనేక పతకాలను కై వసం చేసుకున్నారు. బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు మహారాష్ట్రలో జరిగే జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈనెల 2 నుండి 3వ తేది వరకు గుంటూరు తెనాలిలో 5వ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ క్యాడిట్ మరియు సబ్ జూనియర్, సీనియర్ తైక్వాండో చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో చీరాలకు చెందిన తైక్వాండో క్రీడాకారులు కోచ్ మల్లెల సురేష్ ఆధ్వర్యంలో పోటీలలో పాల్గొన్నారు. ఎంతో ప్రతిభ చూపిన మన క్రీడాకారులు బంగారు, కాంస్య, రజత పతకాలను కై వసం చేసుకున్నారు. పతకాలు కై వసం చేసుకున్నవారిలో మినీ సబ్‌జూనియర్స్ విభాగంలో ఎం.లియో క్రిష్ 21 కేజిల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు. 35 కిలోల సబ్‌జూనియర్ విభాగంలోఎం.దివ్యసాన్వి రజత పతకం, క్యాడిట్ వెయిట్ 21 కిలోలు విభాగంలో ఆర్.ఆకాశరెడ్డి బంగారు పతకం, 35 కేజిల విభాగంలో ఎస్‌కె.వైభవ్ రజత పతకం, జూనియర్స్ విభాగంలో ఐ.రాహుల్ 51 కిలోల విభాగంలో రజతం, ఎం.మ్యాక్సిమస్ 55 కేజిల విభాగంలో రజత పతకం సాధించాడు. సీనియర్స్ విభాగంలో జి.భాస్కర్ 51 కేజిల విభాగంలో బంగారు పతకం సాధించాడు. 60 కేజిల విభాగంలో షేక్ బాజి బంగారు పతకం సాధించాడు. 65 కేజిల విభాగంలో ఎం.మహేష్‌బాబు బంగారు పతకం సాధించాడు. ఎస్‌కె.సుభాని 54 కేజిల విభాగంలో రజత పతకం సాధించాడు. ఈ పోటీలలో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు మహారాష్ట్ర నాసిక్‌లో జరిగే సీనియర్ నేషనల్ తైక్వాండో పోటీలలో పాల్గొంటారని జల్లా తైక్వాండో అసోసియేషన్ సెక్రటరి మల్లెల సురేష్ తెలిపారు. పోటీలలో పతకాలు సాధించిన క్రీడాకారులు, కోచ్ సురేష్‌లు శుక్రవారం ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్ ట్రాఫిక్ ఎస్సై ఎం.పవన్‌కుమార్‌ను మర్యాదపూర్వంగా కలిశారు. క్రీడాకారులను కోచ్‌ను ఎస్సై సత్కరించారు. జాతీయ స్థాయి పోటీలలో రాణించి చీరాలకు మంచిపేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను క్రీడాభిమానులు క్రీడాప్రేమికులు అభినందనలు తెలియజేశారు.
బంగారు, కాంస్య, రజత పతకాలు కై వసం జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించిన బంగారు పతకదారులు