దమ్మపేట/ములకలపల్లి : ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలకు కొలతల ప్రకారమే వేతనం చెల్లిస్తామని డీపీఓ చంద్రమౌళి అన్నారు. దమ్మపేట మండలం మందలపల్లి, ములకలపల్లిలోని సుందరయ్య నగర్ శివారులో చేస్తున్న ఉపాధి హామీ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఎంత పనిచేస్తే రూ.300 కూలీ వస్తుందనే విషయాన్ని కొలతల ద్వారా వివరించారు. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 31 లోగా అన్ని పంచాయతీల్లో ఇంటి పన్ను బకాయిలు పూర్తిగా వసూలు చేయాలని జీపీ కార్యదర్శులను ఆదేశించారు. వసూలైన నగదును వెంటనే ఎస్‌టీఓలో జమ చేయాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీఓ రవీంద్రారెడ్డి, ఎంపీఓ రామారావు, ఇన్‌చార్జ్ ఎంపీఓ వెంకటేశ్వర్లు, గ్రామ కార్యదర్శులు రవి, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.