కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా లక్కినేని సత్యనారాయణ విజయం సాధించారు. గురువారం ఎన్నికలు నిర్వహించగా, అధ్యక్ష పదవికి ఎన్.వెంకటరాజేష్, అనుబ్రోలు రాంప్రసాద్, లక్కినేని సత్యనారాయణ, కె. వెంకటేశ్వరావు, జీ.రాంమూర్తి పోటీ పడ్డారు. లక్కినేని సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థిపై 12 ఓట్ల తేడాతో గెలుపొందారు. వైస్ ప్రెసిడెంట్‌గా గోపికృష్ణ 18 ఓట్లు, జనరల్ సెక్రటరీగా భాగం మాధవరావు 4 ఓట్లు, ట్రెజరర్‌గా చిన్నకృష్ణ ఐదు ఓట్లు, స్పోర్ట్స్ సెక్రటరీగా ఉప్పు అరుణ్ 14 ఓట్ల మెజారిటీతో గెలిచారు. జాయింట్ సెక్రటరీగా కె.రమేష్, లైబ్రరీ సెక్రటరీగా ఎం.ప్రసాద్, లేడీ రిప్రెజెంటివ్‌గా ఏ.పార్వతి ఎన్నికయ్యారు. విజేతలు కొత్తగూడెం కోర్టు ఆవరణలో రంగులు చల్లుకుని స్వీట్లు పంచుకున్నారు. పోస్టాఫీస్ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తనపై నమ్మకం ఉంచి మళ్లీ గెలిపించినందుకు అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు.