భక్తులకు నిరాశేనా..? | - | Sakshi
Sakshi News home page

భక్తులకు నిరాశేనా..?

Apr 3 2025 12:24 AM | Updated on Apr 3 2025 12:24 AM

భక్తులకు నిరాశేనా..?

భక్తులకు నిరాశేనా..?

స్టేడియాన్ని పునర్నిర్మిస్తే భేష్‌..

ప్రస్తుతం ఉన్న మిథిలా స్టేడియాన్ని 1964లో నాటి సీఎం నీలం సంజీవ రెడ్డి ప్రారంభించగా మూడు వైపులా అదనపు గ్యాలరీలను 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌ ప్రారంభించారు. అయితే అప్పటికి ఇప్పటికీ భక్తుల సంఖ్య భారీగా పెరుగడంతో అవి ఎటూ సరిపోవడం లేదు. దీనికి తోడు 2027లో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఆ సమయానికై నా మిథిలా స్టేడియాన్ని పునర్నిర్మిస్తే బాగుంటుందని భక్తులు అంటున్నారు.

భద్రాచలం: శ్రీరామనవమి రోజున రామయ్య కల్యాణ ఘట్టం టీవీల్లో కనిపించినా, రేడియోలో వ్యాఖ్యానం వినిపించినా.. భద్రాచలం మిథిలా స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించాలనేది భక్తుల కోరిక. ఆ ఆశతో భద్రాచలం వచ్చే చాలా మందికి నిరాశే ఎదురవుతోంది. వీవీఐపీ, వీఐపీ సెక్టార్లలో మినహా ఇతర సెక్టార్లలో, సామాన్య భక్తులు ఉచితంగా కూర్చునే షెడ్లలో పూర్తి స్థాయిలో ఎల్‌ఈడీలు ఏర్పాటు చేయడం లేదు. దీంతో వేదికకు దూరంగా ఉన్నవారు కల్యాణ తంతును కనులారా వీక్షించలేని పరిస్థితి నెలకొంటోంది. దీనికి తోడు ప్రతి ఏడాదీ వీవీఐపీ, వీఐపీల తాకిడి పెరుగుతుండగా ఇతర సెక్టార్ల టికెట్లను కుదించే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ ఏడాది శ్రీరామనవమికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానుండగా మంత్రులు, ఎమ్మెల్యేలు, వీవీఐపీలు, వీఐపీల తాకిడి పెరగనుంది. దీంతో కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ రెండు రోజులుగా భద్రాచలంలోనే ఉండి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. సీఎం, వీవీఐపీల సెక్టార్లను పెంచాలని దేవస్థానం అధికారులకు సూచించారు. దీంతో 1000 టికెట్లు గల ఉభయదాతల సెక్టార్‌ను 775కు కుదించారు. వీఐపీ సెక్టార్‌ను సైతం కుదిస్తున్నారు. ఇలా ప్రతి ఏడాది వీవీఐపీలు, వీఐపీల రాకతో ఇతర సెక్టార్ల విభజన జరుగుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా స్టేడియాన్ని పునర్నిర్మిస్తే శాశ్వత రీతిలో సెక్టార్లను విభజించే అవకాశం ఉంటుంది. తద్వారా భక్తులందరికీ స్వామివారి కల్యాణ దర్శన భాగ్యం దక్కుతుంది.

ఎల్‌ఈడీలైనా పెంచాలి..

మిథిలా స్టేడియంలో ప్రస్తుతం వీవీఐపీ, వీఐపీ, ఉభయదాతలకు కలిపి సుమారు 13 వేల టికెట్లు విక్రయిస్తున్నారు. స్టేడియానికి మూడు వైపులా ఏర్పాటు చేసిన ఉచిత గ్యాలరీల్లో మరో 15 వేల మంది భక్తులు కూర్చునే అవకాశం ఉంది. అంతేకాక చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ పలువురు నిల్చుని కల్యాణాన్ని చూస్తుంటారు. స్టేడియం మధ్య భాగంలో కల్యాణ మండపం ఉంటుంది. సుమారు రెండున్నర ఎకరాల్లో కూర్చునే వారందరికీ కల్యాణ తంతు కనిపించడం కష్టమే అయినా దూరంగా చూస్తూనే అనేక మంది భక్తి పారవశ్యంలో మునిగి తేలుతుంటారు. అయితే స్టేడియంలో కూర్చునే 13 వేల మంది కోసం 30 ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తుండగా.. ఉచిత గ్యాలరీల్లో కూర్చునే 15 వేల మందికి 15 టీవీలను మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. వీటి సంఖ్య పెంచాలని భక్తులు కోరుతున్నారు.

రామయ్య కల్యాణాన్ని వీక్షించడం కష్టమే..

వీవీఐపీల తాకిడితో ఉభయదాతల టికెట్ల కుదింపు

మిథిలా స్టేడియంలో సామాన్యులకు తప్పని ఇక్కట్లు

సరిపడా ఏర్పాటు చేయని ఎల్‌ఈడీ స్క్రీన్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement