మెటా ఆధ్వర్యంలో ఉన్న ప్రముఖ ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన వినియోగదారులకు చెందిన కొన్ని ఖాతాలను తొలగించినట్లు ప్రకటించింది. ఐటీ నియమాలు 2021 ఉల్లంఘన, వాట్సప్ దుర్వినియోగం చేస్తున్న కారణంగా ఏకంగా 76 లక్షల ఖాతాలను రద్దు చేసినట్లు చెప్పింది.
నెలవారీ నివేదికలో భాగంగా ఫిబ్రవరిలో పెద్దఎత్తున భారతీయ ఖాతాలపై నిషేధం విధించినట్లు వాట్సప్ తెలిపింది. ఫిబ్రవరి 1-29 మధ్య 76,28,000 ఖాతాలను నిషేధించినట్లు వెల్లడించింది. వీటిలో 14,24,000 ఖాతాలపై ఎలాంటి ఫిర్యాదులూ అందకపోయినప్పటికీ, ఐటీ నిబంధనలను అతిక్రమించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.
దేశంలో వాట్సప్ యూజర్లు 50 కోట్లకు పైగా ఉన్నారు. ప్రతినెల వాట్సప్‌కు కొన్ని ఖాతాలకు సంబంధించిన ఫిర్యాదులు అందుతుంటాయి. అయితే ఫిబ్రవరిలో మాత్ర రికార్డు స్థాయిలో 16,618 వినతులు వచ్చాయి. వాటిలో 22 ఖాతాలపై మాత్రమే వాట్సప్ యాక్షన్ తీసుకుంది. మిగతా అకౌంట్లను మాత్రం సమాచార నిబంధనలు ఉల్లఘించిన కారణంగా తొలగించినట్లు చెప్పింది. ఇదిలాఉండగా.. వాట్సప్ జనవరి నెలలో 67,28,000 ఖాతాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. వీటిలో కూడా 13,58,000 ఖాతాలకు యూజర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులూ అందకపోవడం గమనార్హం.
ఇదీ చదవండి: హోమ్ రోబోటిక్స్ విభాగంలోకి ప్రపంచ నం.1 కంపెనీ..?
Comments
Please login to add a commentAdd a comment