టాటా అంటే మొదట గుర్తొచ్చే పేరు 'రతన్ టాటా'. కానీ టాటా కుటుంభంలో చాలామందికి తెలియని కొంతమందిలో 'మాయా టాటా' ఒకరు. రతన్ టాటా మార్గదర్శకత్వంలో భవిష్యత్ నాయకత్వ లక్షణాలు పొందుతున్న ఈమె టాటా గ్రూప్ డిజిటల్ విభాగంలో పని చేస్తోంది.
మాయా టాటా ఆమె తోబుట్టువులు లేహ్, నెవిల్లే కూడా రతన్ టాటా బోర్డులో కొత్త సభ్యులుగా చేరారు. మల్టిపుల్ బిలియన్ డాలర్ల సాల్ట్ టు సాఫ్ట్‌వేర్ సమ్మేళనానికి నాయకత్వం వహించడానికి వీరు ప్రత్యేకంగా తయారైనట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.
నోయెల్ టాటా ముగ్గురు పిల్లలలో మాయా టాటా చిన్నది. ఈ ముగ్గురూ టాటా గ్రూప్‌లో వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. మాయా UK బేయెస్ బిజినెస్ స్కూల్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ వార్‌విక్ నుంచి డిగ్రీ పట్టా పొందింది. ఈమె తల్లి ఆలూ మిస్త్రీ, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ సోదరి, పల్లోంజి మిస్త్రీ కుమార్తె.
(ఇదీ చదవండి: Jeep Grand Cherokee: మొన్న విడుదలైంది, అప్పుడే కొత్త ధరలు)
నోయెల్ టాటా కుమార్తె మాయా టాటాకి న్యూ ఏజ్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ ఆసక్తి ఉండటం వల్ల తక్కువ వయసుకే వ్యాపార రంగంలోకి ప్రవేశించింది. ఈమె వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా సమాచారం అందుబాటులో లేదు, అయితే 2011లో రతన్ టాటా ప్రారంభించిన కోల్‌కతా క్యాన్సర్ ఆసుపత్రిని నిర్వహిస్తున్న టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులోని ఆరుగురు సభ్యులలో ఆమె ఒకరుగా కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment