గతేడాది చివర్లో దేశీయ దిగ్గజ టెలికాం సంస్థలు టారిఫ్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సుమారు 20 శాతం మేర టారిఫ్ ధరలను దిగ్గజ టెలికాం కంపెనీలు పెంచాయి. కాగా ఈ ఏడాదిలో ఎయిర్ టెల్ టారిఫ్ ధరలను మరోమారు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కలిసొచ్చిన టారిఫ్ ధరల పెంపు..!
మొబైల్ టారిఫ్ ధరల పెంపుతో భారతీ ఎయిర్‌టెల్‌కు మూడో త్రైమాసికంలో కాస్త కలిసొచ్చింది. వీటితో పాటు కంపెనీలో గూగుల్ పెట్టుబడులు ఉపశమనం కల్గించాయని కంపెనీ పేర్కొంది. ఎయిర్‌టెల్ డిసెంబర్ త్రైమాసికంలో నికర లాభం రూ. 854 కోట్ల నుంచి రూ. 830 కోట్లకు 3 శాతం పడిపోయిందని నివేదించింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సంవత్సరానికి 13 శాతం పెరిగింది. ఈ త్రైమాసికంలో ఏఆర్‌పీయూ రూ.163కు మెరుగుపడింది. అయితే మరో మూడు లేదా నాలుగు నెలల్లో కాకపోయినా, ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలోనే మరో మారు టారిఫ్ పెంపు ఉండవచ్చునని ఎయిర్‌టెల్ టాప్ మేనేజ్‌మెంట్ అభిప్రాయపడ్డారు. 2022లో నెలకు ARPU (ఒక వినియోగదారుడి సగటు రాబడి)ని రూ. 200 తీసుకోవాలని కంపెనీ భావిస్తోందని మేనేజ్‌మెంట్ పేర్కొంది. దీంతో టారిఫ్ పెంపు మరోమారు ఉండే అవకాశం ఉన్నట్లు కన్పిస్తోంది.
బోర్డు ఆమోదం..!
డెట్ సెక్యూరిటీలు, బాండ్లు మొదలైన వాటి జారీ ద్వారా రుణ సాధనాల్లో రూ. 7,500 కోట్ల వరకు సేకరించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. కంపెనీ పోస్ట్ ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా, ఎయిర్‌టెల్ టారిఫ్ పెంపు ప్రారంభ సంకేతాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని , కొత్త ఉత్పత్తులను వేగవంతం చేయడంపై కంపెనీ తన దృష్టిని కొనసాగిస్తుందని బోర్డు మీటింగ్‌లో తెలిపింది.
చదవండి: కిలోమీటర్‌కు కేవలం 14 పైసల ఖర్చు..! తక్కువ ధరలో మరో ఎలక్ట్రిక్ బైక్..!
Comments
Please login to add a commentAdd a comment