Bank Holidays in April 2022: Check the Full List of Holidays Here - Sakshi
Sakshi News home page

Bank Holidays: ఏప్రిల్ నెల బ్యాంకు సెలవులు జాబితా ఇదే..!

Published Tue, Mar 29 2022 12:21 PM | Last Updated on Tue, Mar 29 2022 4:54 PM

Bank Holidays in April 2022: Check the Full List of Holidays Here - Sakshi

వచ్చే ఏప్రిల్ నెలలో మీకు ఏమైనా ముఖ్యమైన బ్యాంకు పనులు ఉన్నాయా? అయితే ముఖ్య గమనిక. దేశవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవులు వస్తున్నాయి. భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోని అన్ని బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవులు ఉండవు. రాష్ట్రాన్ని బట్టి సెలవులు మారుతుంటాయి. బ్యాంకుకు వెళ్లే ముందు ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకుంటే మంచిది.

బ్యాంకుల్లో ఏదైనా పని ఉంటే సెలవు రోజులకు అనుగుణంగా ముందుగానే ప్లాన్​ చేసుకోవడం ఉత్తమం. నిజానికి బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ.. ఆన్​లైన్​ లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదు. అన్ని అన్​లైన్​ లావాదేవీలు 24 గంటలు పని చేస్తాయి. ఏటీఎంలలో కూడా నగదు విత్​డ్రా చేసుకునే వీలుంటుంది. 

ఏప్రిల్ నెల బ్యాంక్​ సెలవుల జాబితా: 
ఏప్రిల్​ 1- 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అకౌంట్స్​ క్లోజింగ్​ డే. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
ఏప్రిల్​ 2- ఉగాది(తెలుగు నూతన సంవత్సరం), గుడిపడ్వా. తెలంగాణ, అంధ్రప్రదేశ్​, కర్ణాటక, మహారాష్ట్ర సహా వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు సెలవులో ఉంటాయి.
ఏప్రిల్​ 3- ఆదివారం(సాధారణ సెలవు)
ఏప్రిల్​ 4- సర్హుల్ సందర్భంగా జార్ఖండ్​ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్​ 5- బాబు జగ్జీవన్ రామ్​ జయంతి (దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు)
ఏప్రిల్​ 9- రెండో శనివారం(సాధారణ సెలవు)
ఏప్రిల్​ 10- ఆదివారం(సాధారణ సెలవు)
ఏప్రిల్​ 14- డాక్టర్​ బాబాసాహెబ్​ అంబేడ్కర్​ జయంతి, మహవీర్ జయంతి, వైశాఖి, తమిళ నూతన సంవత్సరం, బిజు ఫెస్టివల్​, బోగ్ బిహు. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్​ 15- గుడ్​ ఫ్రైడే, బెంగాలి న్యూ ఇయర్​, హిమాచల్ డే, విషు(దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు)
ఏప్రిల్​ 16- బోగ్ బిహు
ఏప్రిల్​ 17- ఆదివారం(సాధారణ సెలవు)
ఏప్రిల్​ 21- గరియా పూజ
ఏప్రిల్​ 23- నాలుగో శనివారం(సాధారణ సెలవు)
ఏప్రిల్​ 24- ఆదివారం(సాధారణ సెలవు)
ఏప్రిల్​ 29- శాబ్-ఐ-ఖదర్​/ జుమాత్​-ఉల్​-విదా

(చదవండి: పెరిగిన కేంద్ర ప్రభుత్వ రుణ భారం.. అప్పు ఎన్ని లక్షల కోట్లు తెలుసా?)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement