ఏప్రిల్ 1 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ఈ నెలలో వివిధ పండగలు, పర్వదినాలతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
గతంతో పోలిస్తే ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారు. ప్రస్తుతం లావాదేవీలన్నీ డిజిటలైజ్ అయినా, కొన్ని అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకు శాఖలకు వెళ్లాల్సి రావచ్చు. ఈ పరిస్థితుల్లో బ్యాంకుకు వెళ్లేముందు ఏయే రోజుల్లో వాటికి సెలవులు ఉన్నాయో చెక్ చేసుకోవడం మంచిది. ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలయింది. ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం వివిధ రాష్ట్రాలతో కలిపి బ్యాంకులకు 14 రోజులు సెలవులు ఉంటాయి.
ఏప్రిల్ 1: వార్షిక బ్యాంకు ఖాతాల క్లోజింగ్ సందర్భంగా దేశమంతా బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే చండీగఢ్, సిక్కిం, మిజోరం, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో మాత్రం బ్యాంకులు పని చేస్తాయి.
ఏప్రిల్ 5: మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, జుమాత్ ఉల్ విదా సందర్భంగా తెలంగాణ, జమ్ముల్లో బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 9: ఉగాది, తెలుగు సంవత్సరాది, గుడిపడ్వ, సాజిబు నాంగపంబా (చీరావుబా) తొలి నవరాత్రి సందర్భంగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, గోవా, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 10: బొహగ్ బిహు, బైశాఖీ, బిజూ ఫెస్టివల్ సందర్భంగా త్రిపుర, అసోం, జమ్ముకశ్మీర్‌ల్లో బ్యాంకులు పని చేయవు.
ఏప్రిల్ 15: బొహగ్ బిగు, హిమాచల్ దినోత్సవం సందర్భంగా అసోం, త్రిపుర, మణిపూర్, జమ్ముకశ్మీర్‌ల్లో బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 16: శ్రీరామ నవమి సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
ఏప్రిల్ 20: గరియా పూజ పండుగ సందర్భంగా త్రిపురలోని బ్యాంకులకు సెలవు.
ఇదీ చదవండి: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన ధరలు!
ఏప్రిల్ 13న రెండో శనివారం, 27న నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. ఆదివారాలు కలుపుకుంటే ఈ నెలలో బ్యాంకులు పనిచేసేది 16 రోజులేనని గమనించాలి.
Comments
Please login to add a commentAdd a comment