![BlackRock Inc announced plans to expand its workforce in India by hiring approximately 1200 new employees](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/blackrock01.jpg.webp?itok=xBKitasn)
ప్రపంచంలోనే ప్రముఖ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ బ్లాక్‌రాక్ ఇంక్.(BlackRock) భారత్‌లో సుమారు 1,200 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోనుంది. దీని ద్వారా దేశంలో తన ఉద్యోగుల సంఖ్యను విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది. కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యాలను పెంచడం, ముంబై, గుర్‌గావ్‌లో ఐహబ్స్‌గా పిలువబడే దాని సపోర్ట్ హబ్‌లను పెంచేందుకు ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ తోడ్పడుతుందని కంపెనీ తెలిపింది.
వ్యూహాత్మక విస్తరణ
మెరుగైన అసెట్ మేనేజ్‌మెంట్ సేవల కోసం ఏఐను ఉపయోగించుకోవాలనే బ్లాక్‌రాక్ విస్తృత వ్యూహంలో భాగంగా ఈ ఉద్యోగాలు కల్పించనున్నారు. ఇంజినీర్లు, డేటా నిపుణులతో సహా కృత్రిమ మేధ సాంకేతికతల అభివృద్ధి, వాటిని అమలు చేసే విభాగాల్లో రిక్రూట్‌మెంట్ ఉంటుందని కంపెనీ అధికారులు తెలిపారు. ముంబై, గుర్‌గావ్‌లోని బ్లాక్‌రాక్ ఐహబ్‌లు ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్, రిస్క్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ ఇంజినీరింగ్, బిజినెస్ ఆపరేషన్స్, డేటా అనలిటిక్స్ వంటి విలువ ఆధారిత సేవలకు సంబంధించి కొత్త ఆవిష్కరణలు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. కొత్త ఉద్యోగులతో మొత్తం భారత్‌లో వీరి సంఖ్య 3,500కు చేరుతుంది.
ఇదీ చదవండి: గరిష్ట వడ్డీరేట్లను బహిర్గతం చేయాలని ఆదేశాలు
ప్రికిన్ కొనుగోలు
బ్లాక్‌రాక్ సంస్థ ప్రికిన్ అనే అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీను కూడా కొనుగోలు చేయనుంది. దాంతో బెంగళూరులో 1,500 మంది ఉద్యోగులతో గ్లోబల్ సామర్థ్యాల కేంద్రాన్ని బ్లాక్‌రాక్ సొంతం చేసుకోనుంది. ఈ కొనుగోలు సంస్థ డేటా ఇంటెలిజెన్స్, అనలిటిక్స్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుందని నమ్ముతున్నారు. సంస్థకు కీలకమైన కార్యకలాపాల స్థావరంగా ఈ బెంగళూరు కార్యాలయం ఉంటుందని కంపెనీ తెలిపింది. పెరుగుతున్న శ్రామిక శక్తికి అనుగుణంగా ముంబై శివారులోని గోరేగావ్‌లో అదనపు కార్యాలయ స్థలాన్ని ఒబెరాయ్ రియల్టీ లిమిటెడ్ నుంచి బ్లాక్‌రాక్ లీజుకు తీసుకుంది. దీనికి సంబంధించి ఇరు సంస్థల మధ్య దాదాపు రూ.400 కోట్లు (45.9 మిలియన్ డాలర్లు) విలువైన డీల్ కుదిరింది.
Comments
Please login to add a commentAdd a comment