![Central Govt Focus on 6G Technology](/styles/webp/s3/article_images/2024/09/13/jyotiraditya-scindia.jpg.webp?itok=GTxvHO6M)
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే 5జీ నెట్‌వర్క్‌లో వేగంగా విస్తరిస్తున్న భారత్.. 6జీ టెక్నాలజీపై దృష్టిపెట్టినట్లు కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. తద్వారా 6వ జనరేషన్(6జీ) మొబైల్ సర్వీసులలో ప్రపంచ పేటెంట్లలో 10వ వంతును అందిపుచ్చుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.
ఏఐఎంఏ నేషనల్ మేనేజ్‌మెంట్ కన్వెన్షన్ ఇక్కడ నిర్వహించిన 51వ సదస్సు(ఎడిషన్) సందర్భంగా కీలకోపన్యాసం చేశారు. 5జీ సేవల నెట్‌వర్క్‌లో ప్రపంచంలోనే భారత్ వేగంగా విస్తరిస్తున్నట్లు ప్రస్తావించారు. పీఎస్‌యూ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కోసం సొంత 4జీ టెక్నాలజీకి తెరతీసినట్లు పేర్కొన్నారు. 22 నెలల్లోనే 4.5 లక్షల 4జీ టవర్లు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ బాటలో 6జీ సాంకేతికతలోకి ప్రవేశించేందుకు భారత్ 6జీ కూటమి(అలయెన్స్)ను నెలకొలి్పనట్లు వెల్లడించారు.
రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్త పేటెంట్లలో 10 శాతాన్ని సాధించేందుకు కృషి చేయనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం భారత్ ప్రపంచస్థాయిలో పురోగమిస్తున్నదని, సవాళ్లు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థ స్థాయిని అధిగమించిందని వివరించారు. ప్రపంచ ఆర్థిక, సామాజిక అనిశి్చత పరిస్థితుల్లో భారత్ నిలకడ, నమ్మకాల దిక్సూచిలా అవతరించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే మొబైల్ ఫోన్ల తయారీలో రెండో పెద్ద దేశంగా భారత్ నిలుస్తున్నదని వెల్లడించారు.
ఇదీ చదవండి: మూడు నెలల్లో భారీగా ఉద్యోగాలు.. ఈ రంగాల్లోనే అధికం
గత దశాబ్దంలో దేశీ కమ్యూనికేషన్ పరిశ్రమ సొంత బాటలో పరివర్తన చెందినట్లు తెలియజేశారు. సొంతంగా పూర్తి 4జీ టెక్నాలజీని అభివృద్ధి చేయడంతోపాటు.. వచ్చే ఏడాది మధ్యలో మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. దేశీయంగా టెక్నాలజీ డిజైన్, అభివృద్ధి, అమలును చేపట్టినట్లు తెలియజేశారు. గ్లోబల్ ప్రమాణాలను అనుసరించడంతోపాటు.. రానున్న రోజుల్లో భారత్ సొంతంగా ప్రపంచానికి ప్రమాణాలను నిర్దేశించనున్నట్లు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment