
న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ కోఫోర్జ్ ప్రమోటర్ సంస్థ హల్‌స్ట్ బీవీ తాజాగా కంపెనీలో దాదాపు 10 శాతం వాటాను విక్రయించింది. గతంలో ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌గా వ్యవహరించిన కంపెనీలో 60 లక్షల షేర్ల(9.85 శాతం వాటా)ను ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ప్రమోటర్ సంస్థ విక్రయించింది. బీఎస్‌ఈ బల్క్‌డీల్ గణాంకాల ప్రకారం షేరుకి రూ. 4261–4,273 ధరల మధ్య షేర్లను ఆఫ్‌లోడ్ చేసింది. ఈ లావాదేవీల విలువ సుమారు రూ. 2,560 కోట్లు. సొసైటీ జనరాలి 4.86 లక్షల షేర్లు, నోమురా ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ మదర్ ఫండ్ 4.67 లక్షల షేర్లు చొప్పున కొనుగోలు చేశాయి. 2021 డిసెంబర్‌కల్లా కోఫోర్జ్‌లో హల్‌స్ట్ బీవీ వాటా 49.97 శాతంగా నమోదైంది. వెరసి 3.04 కోట్ల షేర్లను కలిగి ఉంది.
ఈ లావాదేవీల నేపథ్యంలో కోఫోర్జ్ షేరు బీఎస్‌ఈలో 6.6 శాతం పతనమై రూ. 4,257 దిగువన ముగిసింది. ఇంట్రాడేలో రూ. 4,350– 4,230 మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది.
Comments
Please login to add a commentAdd a comment