NIIT Technologies
-
కోఫోర్జ్ ప్రమోటర్ వాటా సేల్
న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ కోఫోర్జ్ ప్రమోటర్ సంస్థ హల్స్ట్ బీవీ తాజాగా కంపెనీలో దాదాపు 10 శాతం వాటాను విక్రయించింది. గతంలో ఎన్ఐఐటీ టెక్నాలజీస్‌గా వ్యవహరించిన కంపెనీలో 60 లక్షల షేర్ల(9.85 శాతం వాటా)ను ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ప్రమోటర్ సంస్థ విక్రయించింది. బీఎస్ఈ బల్క్‌డీల్ గణాంకాల ప్రకారం షేరుకి రూ. 4261–4,273 ధరల మధ్య షేర్లను ఆఫ్‌లోడ్ చేసింది. ఈ లావాదేవీల విలువ సుమారు రూ. 2,560 కోట్లు. సొసైటీ జనరాలి 4.86 లక్షల షేర్లు, నోమురా ఇండియా ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మదర్ ఫండ్ 4.67 లక్షల షేర్లు చొప్పున కొనుగోలు చేశాయి. 2021 డిసెంబర్‌కల్లా కోఫోర్జ్‌లో హల్స్ట్ బీవీ వాటా 49.97 శాతంగా నమోదైంది. వెరసి 3.04 కోట్ల షేర్లను కలిగి ఉంది. ఈ లావాదేవీల నేపథ్యంలో కోఫోర్జ్ షేరు బీఎస్ఈలో 6.6 శాతం పతనమై రూ. 4,257 దిగువన ముగిసింది. ఇంట్రాడేలో రూ. 4,350– 4,230 మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. -
ఎన్ఐఐటీ టెక్- ఎడిల్వీజ్.. షేర్ల జోరు
ముందురోజు హైజంప్ చేసిన దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాట పట్టాయి. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా సాఫ్ట్వేర్ సేవల మధ్యస్థాయి కంపెనీ ఎన్ఐఐటీ టెక్నాలజీస్, ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ఎన్ఐఐటీ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఎన్ఐఐటీ టెక్నాలజీస్ నికర లాభం 30 శాతం క్షీణించి రూ. 80 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 5 శాతం తక్కువగా రూ. 1057 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 9 శాతం వెనకడుగుతో రూ. 181 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 17.1 శాతంగా నమోదయ్యాయి. ఈ కాలంలో 18.6 కోట్ల డాలర్ల విలువైన కాంట్రాక్టులను కుదుర్చుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. క్యూ2(జులై-సెప్టెంబర్)లో ఆదాయంలో 7 శాతం వృద్ధిని అందుకోగలమని కంపెనీ అంచనా వేస్తోంది. ఇదే విధంగా మార్జిన్లు 1.5 శాతం బలపడగలవని భావిస్తోంది. సానుకూల గైడెన్స్ నేపథ్యంలో ఎన్ఐఐటీ టెక్నాలజీస్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6 శాతం దూసుకెళ్లి రూ. 1871 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1894 వరకూ ఎగసింది. ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ చేపట్టనున్న పబ్లిక్ ఇష్యూకి సంబంధించి ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డెలాయిట్.. అడ్వయిజర్స్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ప్రీఐపీవో లావాదేవీల అడ్వయిజర్‌గా డెలాయట్ తోపాటు..ఎడిల్వీజ్ ఫైనాన్షియల్‌ను ఎల్ఐసీ ఎంపిక చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. వెరసి ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 78 సమీపంలో ఫ్రీజయ్యింది. -
ఎన్ఐఐటీకి బ్రెగ్జిట్ దెబ్బ
ముంబై: ఎన్ఐఐటి టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ఏకీకృత నికర లాభంలో 9 శాతం క్షీణతను నమోదు చేసింది. క్యూ2లో(జూలై-సెప్టెంబర్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 60 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 64.6 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. అయితే ఏకీకృత ఆదాయం రూ 2 శాతం వృద్ధితో 692.9 కోట్లను సాధించింది. 2015 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 679 కోట్లుగా ఉంది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు మరియు బీమా (బీఎఫ్ఎస్ఐ) 3.4 శాతంగా ఉన్నాయి సోమవారం సంస్థ ఫలితాల ప్రకటన తర్వాత ఇన్వెస్టర్లు సెంటిమెంట్ దెబ్బతినడంతో అమ్మకాలు జోష్ అందుకుంది. దాదాపు 6.3 శాతం పతనమై చివరికి 4.8 శాతం నష్టాలకు పరిమితమైంది. కాగా బ్రెగ్జిట్ అనిశ్చిత పరిణామాలు, ఎన్ఐటీఎల్ (బ్రిటన్ లో బీమా సేవలు అందించే) ఆదాయాల్లో క్షీణత తమ లాభాలను ప్రభావితం చేశాయని ఎన్ ఐఐటీ సీఈవో అరవింద్ ఠాకూర్ చెప్పారు. కంపెనీ డిజిటల్ వ్యాపారం బలంగా ఉందనీ, దీంతో మొత్తం రాబడిలో 19 శాతం సాధించిందని చెప్పారు. -
ఎన్ఐఐటీ టెక్నాలజీస్ లాభం 48% డౌన్
న్యూఢిల్లీ: ఎన్ఐఐటీ టెక్నాలజీస్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో 48% క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.54 కోట్లుగా ఉన్న తమ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో 48% క్షీణించి రూ.29 కోట్లకు తగ్గిందని ఎన్ఐఐటీ టెక్నాలజీస్ తెలిపింది. ఒక ప్రభుత్వ కాంట్రాక్టు వాయిదా పడడంతో భారత అకౌంటింగ్ ప్రమాణాల ప్రకారం ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి రూ.31 కోట్ల ఒక్కసారి కేటాయింపు కారణంగా ఈ స్థాయిలో నష్టం వచ్చిందని వివరించింది. గత క్యూ1లో రూ.642 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ1లో 5% వృద్ధితో రూ.671 కోట్లకు పెరిగిందని ఎన్ఐఐటీ టెక్నాలజీస్ సీఈఓ, జాయింట్ ఎండీ అర్వింద్ ఠాకూర్ చెప్పారు. -
ఎన్ఐఐటీ లాభం రూ.79 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ సొల్యూషన్స్ అందించే ఎన్ఐఐటీ టెక్నాలజీస్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.79 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్)ఆర్జించింది. అమెరికా, బ్యాంకింగ్, ఆర్థిక సేవల విభాగాల్లో భారీ వృద్ధి కారణంగా ఈ స్థాయి నికర లాభం ఆర్జించామని ఎన్ఐఐటీ టెక్నాలజీస్ పేర్కొంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2014-15) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.18 కోట్ల నష్టం వచ్చిందని ఎన్ఐఐటీ టెక్నాలజీస్ సీఈఓ అర్వింద్ ఠాకూర్ చెప్పారు. ఇక ఆదాయం రూ.611 కోట్ల నుంచి 12 శాతం వృద్ధితో రూ.685 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్డర్లు, దేశీయ వ్యాపారంపై దృష్టి తగ్గించామని, మార్జిన్లు పెరిగాయని పేర్కొన్నారు. ఈ క్వార్టర్లో 12 కోట్ల డాలర్ల విలువైన తాజా ఆర్డర్లను సాధించామన్నారు.