ఎన్ఐఐటీ టెక్నాలజీస్ లాభం 48% డౌన్ | NIIT Tech net profit down over 47% to Rs 28.6 cr for Q1 | Sakshi
Sakshi News home page

ఎన్ఐఐటీ టెక్నాలజీస్ లాభం 48% డౌన్

Published Sat, Jul 16 2016 1:09 AM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM

ఎన్ఐఐటీ టెక్నాలజీస్ లాభం 48% డౌన్

ఎన్ఐఐటీ టెక్నాలజీస్ లాభం 48% డౌన్

న్యూఢిల్లీ: ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో 48% క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.54 కోట్లుగా ఉన్న తమ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో 48% క్షీణించి రూ.29 కోట్లకు తగ్గిందని ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్ తెలిపింది. ఒక  ప్రభుత్వ కాంట్రాక్టు  వాయిదా పడడంతో భారత అకౌంటింగ్ ప్రమాణాల ప్రకారం ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి రూ.31 కోట్ల ఒక్కసారి కేటాయింపు కారణంగా ఈ స్థాయిలో నష్టం వచ్చిందని వివరించింది. గత క్యూ1లో రూ.642 కోట్లుగా ఉన్న  ఆదాయం ఈ క్యూ1లో 5% వృద్ధితో రూ.671 కోట్లకు పెరిగిందని ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్ సీఈఓ, జాయింట్ ఎండీ అర్వింద్ ఠాకూర్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement