న్యూఢిల్లీ: రుణ భారంతో సవాళ్లు ఎదుర్కొంటున్న ఫ్యూచర్ గ్రూప్ తిరిగి నిలదొక్కుకోవడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గ్రూప్ కంపెనీలు ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్, సప్లై చైన్ సొల్యూషన్స్, కన్జూమర్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ తిరిగి పట్టాలెక్కేందుకు వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫ్యూచర్ గ్రూప్‌తో రిలయన్స్ రిటైల్ కుదుర్చుకున్న రూ. 24,713 కోట్ల ఒప్పందాన్ని సెక్యూర్డ్ రుణదాతలు తిరస్కరించిన నేపథ్యంలో తాజా అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడింది.
గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్(ఎఫ్‌ఆర్‌ఎల్) దాదాపు రూ. 18,000 కోట్ల రుణ భారాన్ని కలిగి ఉంది. దివాలా చట్ట చర్యలను ఎదుర్కోబోతున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. అయితే ఇతర కంపెనీలు ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్(ఎఫ్‌ఈఎల్), ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్(ఎఫ్‌ఎల్‌ఈఎల్), ఫ్యూచ ర్ సప్లై చైన్ సొల్యూషన్స్(ఎఫ్‌ఎస్‌సీఎస్‌ఎల్), ఫ్యూచర్ కన్జూమర్ (ఎఫ్‌సీఎల్) తమ సొంత ఆస్తుల పునర్వ్యవస్థీకరణ ద్వారా పునరుజ్జీవనం పొందే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
పునరుత్తేజం ఇలా
సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఎఫ్‌ఈఎల్‌కు రూ. 5,000 కోట్ల రుణభారముంది. ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ బిజినెస్‌లో వాటాను విక్రయిస్తోంది. రూ. 3,000 కోట్లవరకూ లభించనున్నాయి. దీంతో రుణ భారం భారీగా తగ్గనుంది.
ఇక కర్ణాటకలోని తుమ్‌కూర్‌లో 110 ఎకరాల ఫుడ్ పార్క్‌ను ఎఫ్‌ఎంసీజీ కంపెనీ ఎఫ్‌సీఎల్ కలిగి ఉంది. ఇది కంపెనీ పునరి్నర్మాణానికి వినియోగపడనుంది. దేశవ్యాప్తంగా ఎఫ్‌ఎస్‌సీఎస్‌ఎల్‌కు వేర్‌హౌస్‌లున్నాయి. నాగ్‌పూర్‌లో అత్యంత భారీ, ఆధునిక ఆటోమేటెడ్ పంపిణీ కేంద్రాన్ని కలి గి ఉంది. ఇవన్నీ కంపెనీకి అండగా నిలవనున్నా యి. అయితే ఈ అంశాలపై స్పందించేందుకు ఫ్యూ చర్ గ్రూప్ ప్రతినిధి నిరాకరించడం గమనార్హం!
సోమవారం ట్రేడింగ్‌లో ఫ్యూచర్ గ్రూప్‌లోని పలు కంపెనీల షేర్లు 20–5% మధ్య పతనమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment