న్యూఢిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా స్పేస్ మంత్ర, సందీప్ గుప్తా, షాలినీ గుప్తా కన్సార్షియం నుండి దాఖలైన బిడ్‌ను ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ లిమిటెడ్ రుణదాతలు ఆమోదించారు. కన్సార్షియం సమర్పించిన రిజొల్యూషన్ ప్లాన్‌కు ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ లిమిటెడ్ యొక్క కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ అనుకూలంగా ఓటు వేసింది. అయితే రుణదాతలు ఆమోదించిన ప్రణాళిక వివరాలను కంపెనీ వెల్లడించలేదు.
ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ కోసం కార్పొరేట్ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ వ్యవధి 2024 ఆగస్ట్ 26తో ముగిసిందని తెలిపింది. ప్రాసెస్ వ్యవధిని పొడిగించాలని కోరుతూ 2024 ఆగస్టు 24న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో రిజొల్యూషన్ ప్రొఫెషనల్ దరఖాస్తు చేశారు. కాగా, మల్టీ బ్రాండ్ రిటైల్ చైన్స్ అయిన సెంట్రల్, బ్రాండ్ ఫ్యాక్టరీని గతంలో ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ నిర్వహించింది.
లీ కూపర్, ఛాంపియన్, ఆల్, ఇండిగో నేషన్, జియోవానీ, జాన్ మిల్లర్, స్కల్లర్స్, కన్వర్స్, అర్బానా వంటి బ్రాండ్ల ఔట్‌లెట్స్ సైతం ఏర్పాటు చేసింది. 22.51 శాతం ఓటింగ్ షేర్‌తో ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ యొక్క కమిటీ ఆఫ్ క్రెడిటార్స్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుంది. ఎస్‌బీఐకి ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ రూ.476.59 కోట్లు బాకీ ఉంది. 12 రుణ సంస్థలకు మొత్తం రూ.2,155.53 కోట్ల క్లెయిమ్స్ ఉన్నాయని ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ 2023 జూన్‌లో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment