insolvency case
-
ఫ్యూచర్ లైఫ్‌స్టైల్‌కు పరిష్కారం!
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా స్పేస్ మంత్ర, సందీప్ గుప్తా, షాలినీ గుప్తా కన్సార్షియం నుండి దాఖలైన బిడ్‌ను ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ లిమిటెడ్ రుణదాతలు ఆమోదించారు. కన్సార్షియం సమర్పించిన రిజొల్యూషన్ ప్లాన్‌కు ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ లిమిటెడ్ యొక్క కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ అనుకూలంగా ఓటు వేసింది. అయితే రుణదాతలు ఆమోదించిన ప్రణాళిక వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ కోసం కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ వ్యవధి 2024 ఆగస్ట్ 26తో ముగిసిందని తెలిపింది. ప్రాసెస్ వ్యవధిని పొడిగించాలని కోరుతూ 2024 ఆగస్టు 24న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో రిజొల్యూషన్ ప్రొఫెషనల్ దరఖాస్తు చేశారు. కాగా, మల్టీ బ్రాండ్ రిటైల్ చైన్స్ అయిన సెంట్రల్, బ్రాండ్ ఫ్యాక్టరీని గతంలో ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ నిర్వహించింది. లీ కూపర్, ఛాంపియన్, ఆల్, ఇండిగో నేషన్, జియోవానీ, జాన్ మిల్లర్, స్కల్లర్స్, కన్వర్స్, అర్బానా వంటి బ్రాండ్ల ఔట్లెట్స్ సైతం ఏర్పాటు చేసింది. 22.51 శాతం ఓటింగ్ షేర్‌తో ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ యొక్క కమిటీ ఆఫ్ క్రెడిటార్స్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుంది. ఎస్బీఐకి ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ రూ.476.59 కోట్లు బాకీ ఉంది. 12 రుణ సంస్థలకు మొత్తం రూ.2,155.53 కోట్ల క్లెయిమ్స్ ఉన్నాయని ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ 2023 జూన్‌లో వెల్లడించింది. -
‘జీ’, సిటీ నెట్‌వర్క్స్‌పై దివాలా చర్యలు: ఎన్సీఎల్ఏటీ భారీ ఊరట
ముంబై: మీడియా సంస్థ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కి భారీ ఊరట లభించింది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) శుక్రవారం జీపై దివాలా చర్యలను ప్రారంభించాలని ఆదేశించిన ఎన్సీఎల్టీ ఉత్తర్వుపై స్టే విధించింది. జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పునిత్ గోయెంకా, కంపెనీకి వ్యతిరేకంగా దివాలా చర్యలను సవాలు చేస్తూ చేసిన అభ్యర్థనను మేరకు ఈ పరిణామం చోటుచేసుకుంది. గోయెంకా దాఖలు చేసిన పిటిషన్‌పై ట్రిబ్యునల్ ప్రైవేట్ రంగ బ్యాంకు ఇండస్ఇండ్ బ్యాంక్‌కు నోటీసు జారీ చేసింది. దీనిపై విచారణను మార్చి 27వ తేదీకి వాయిదా వేసింది. ఎన్సీఎల్ఏటీ ఆదేశాలపై గోయెంకా సంతోషం వ్యక్తం చేశారు.అందరి వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రతిపాదిత విలీనాన్ని సకాలంలో పూర్తి చేయడంపై కట్టుబడి ఉన్నామన్నారు. కాగా జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్), సిటీ నెట్‌వర్క్స్‌పై దివాలా ప్రక్రియకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం తెలిపడం ఆందోళనకు దారి తీసింది. దీనికి సంబంధించి ఇండస్ఇండ్ బ్యాంక్ దాఖలు చేసిన పిటీషన్లను విచారణకు స్వీకరించింది. జీల్ వ్యవహారంలో సంజీవ్ కుమార్ జలాన్‌ను, సిటీ నెట్వర్క్స్ విషయంలో మోహిత్ మెహ్రాను దివాలా పరిష్కార నిపుణులుగా (ఆర్పీ) నియమించింది. ఉత్తర్వులపై రెండు వారాల స్టే ఇవ్వాల్సిందిగా జీల్ కోరినప్పటికీ ఎన్సీఎల్టీ బెంచ్ నిరాకరించింది. దీనిపై జీ ఎంటర్ప్రైజెస్ ఎండీ పునీత్ గోయెంకా .. నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్‌లో (ఎన్సీఎల్ఏటీ) సవాలు చేసిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెడితే జీ గ్రూప్‌లో భాగమైన సిటీ నెట్వర్క్స్ వివిధ బ్యాంకుల నుంచి రూ. 850 కోట్లకు మేర రుణాలు తీసుకుంది. జీల్‌ను హామీదారుగా ఉంచి ఇండస్ఇండ్ నుంచి తీసుకున్న రూ. 89 కోట్ల రుణ చెల్లింపులో సిటీ డిఫాల్ట్ కావడంతో తాజా పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం సోనీలో జీల్ విలీనం తుది దశల్లో ఉన్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడంతో డీల్‌కు అడ్డంకులు ఏర్పడవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఎన్సీఏల్ఏటీ తాజా ఉత్తర్వు సంస్థకు భారీ ఊరట కల్పించింది. -
దేశంలో దివాలా కేసులు ఎన్నో తెలుసా!
జూన్ 2022 నాటికి ఇన్సాల్వెన్సీ చట్టం కింద దాదాపు 1,999 దివాలా కేసులు నమోదయినట్లు లోక్‌సభలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి ఇంద్రజిత్ సింగ్ వెల్లడించారు. ఇందులో 436 రియల్టీకి సంబంధించినవని వెల్లడించారు. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (సీఐఆర్‌పీ) కోసం పట్టే సమయం వ్యాపార స్వభావం, వ్యాపార సైకిల్స్ (ఒడిదుడుకులు), మార్కెట్ సెంటిమెంట్, మార్కెటింగ్ వ్యవహారాలు సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. కోవిడ్–19 మహమ్మారి కాలంలో మందగమనం సహజమని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్, ప్రధాన మంత్రి కార్యాలయం, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇతర అధికారుల నుండి దివాలా బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) ఫిర్యాదులను స్వీకరిస్తుందని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపిన మంత్రి, 2022 జూలై 31వ తేదీ వరకూ ఈ తరహా 6,231 ఫిర్యాదులను స్వీకరించినట్లు వెల్లడించారు. వీటిపై విచారణ జరుగుతున్నట్లు పేర్కొన్నారు.అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఒక ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించి ఆర్పీ(రిజల్యూషన్ ప్రొఫెషనల్)పై డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్కు ఒక ఫిర్యాదు అందినట్లు తెలిపారు. దీనిపై తగిన చర్యలను తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. సీబీఐ కూడా దివాలా పక్రియ దుర్వినియోగానికి సంబంధించి ఒక ఫిర్యాదును అందుకున్నా, తప్పు జరిగినట్లు తేలలేదని తెలిపారు. చదవండి: అధ్యక్షా.. బాస్ అంటే ఇట్టా ఉండాలా.. అదిరిపోయే జీతం, బోలెడు బెనిఫిట్స్ కూడా.. -
హామీదారు ఆస్తులపై చర్యలేమిటి?
న్యూఢిల్లీ: కంపెనీ తీసుకున్న రుణాలు తీర్చలేని సందర్భాల్లో, ఆ రుణాలకు హామీగా ఉన్న వ్యక్తుల వ్యక్తిగత ఆస్తులను దివాలా చర్యల కిందకు తీసుకురావడం సమంజసం కాదంటూ భూషన్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ (బీపీఎస్ఎల్) మాజీ చైర్మన్ సంజయ్ సింఘాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు వీలు కల్పిస్తున్న ఇన్సాలెన్సీ అండ్ బ్యాంక్ట్రప్సీ కోడ్ (ఐబీసీ) నిబంధనల రాజ్యాంగ బద్ధతను, ఈ విషయంలో బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) జారీ చేసిన నోటీసును సవాలుచేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందనను తెలియజేయాలని కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. న్యాయ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖతోపాటు, ఇన్సాల్వెన్సీ బ్యాంక్ట్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ), ఎస్బీఐలకు నోటీసులు జారీ చేసిన చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ ప్రతీక్ జలాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్, కేసు తదుపరి విచారణను అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. అయితే సంజయ్ సింఘాల్ వ్యక్తిగత ఆస్తులను దివాలా చట్రంలోకి తీసుకురావడానికి సంబంధించి ఎస్బీఐ ఇచ్చిన నోటీసు అమలు విషయంలో మాత్రం ప్రస్తుత దశలో ‘స్టే’ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. భూషన్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్‌కు సంబంధించి ఒకపక్క కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ పెండింగులో ఉండగానే మరోవైపు సింఘాల్ వ్యక్తిగత ఆస్తులపై డెట్ రికవరీ ట్రిబ్యునల్‌ను ఎస్బీఐ ఆశ్రయించడం తగదని హైకోర్టులో దాఖలైన సింఘాల్ పిటిషన్ పేర్కొంది. అక్టోబర్ 6నే అనిల్ కేసులో తీర్పు! అక్టోబర్ 6వ తేదీనే అనిల్ అంబానీకి సంబంధించి ఇదే తరహా దివాలా అంశంపై ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించే అవకాశం ఉండడం గమనార్హం. సంబంధిత వ్యాజ్యంలో రానున్న తీర్పు– భూషన్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ మాజీ చైర్మన్ సంజయ్ సింఘాల్ దాఖలు చేసిన ప్రస్తుత పిటిషన్‌కు కూడా వర్తించే అవకాశం ఉంది. అనిల్ కేసు వివరాల్లోకి వెళ్తే... అడాగ్ గ్రూప్‌లోని ఆర్‌కామ్ (రూ.565 కోట్లు), రిలయన్స్ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ (రూ.635 కోట్లు)కు 2016 ఆగస్టులో ఎస్బీఐ రుణం మంజూరు చేసింది. ఈ రుణం మొండిబకాయిగా మారడంతో, అనిల్ అంబానీ ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తును ఎస్బీఐ రుణ బాకీల కింద జప్తు చేసుకోవాలని నిర్ణయించింది. తదుపరి అనిల్ అంబానీకి నోటీసులు కూడా జారీ చేసినప్పటికీ స్పందన రాలేదు. దీనితో ఎన్సీఎల్టీ, ముంబై బెంచ్‌ని ఆశ్రయించింది. దివాలా ప్రక్రియకు సమాంతరంగా గ్యారెంటర్‌పై కూడా విచారణ జరపవచ్చని నిబంధనల్లో స్పష్టంగా ఉందని తన వాదనల్లో పేర్కొంది. ఈ వాదనతో ఏకీభవిస్తూ, ఎన్సీఎల్టీ అనిల్ ఆస్తులపై దివాలా ప్రక్రియకు వీలుగా మధ్యంతర పరిష్కార నిపుణుడి (ఆర్పీ)ని నియమిస్తూ ఆగస్టు 21న ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు అదేనెల 27వ తేదీన స్టే ఇస్తూ, తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేసింది. కేసులో స్పందనకు కేంద్రం, ఎస్బీఐలకు నోటీసులు జారీ చేసింది. ఈ స్టే ఉత్తర్వు్యను ఎస్బీఐ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ నెల 17వ తేదీన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, ఈ అంశానికి ఉన్న ప్రాధాన్యత రీత్యా, తదుపరి విచారణలు ఏమీ లేకుండా అక్టోబర్ 6న కేసు విచారణను చేపట్టి తుది తీర్పు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టుకు సూచించింది. -
అనిల్ అంబానీకి ‘సుప్రీం’ ఊరట
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూప్ (అడాగ్)లో భాగమైన ఆర్‌కామ్, రిలయన్స్ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్‌టీఐఎల్)కు ఇచ్చిన రూ.1,200 కోట్ల రుణాల రికవరీకి సంబంధించి ఆయనపై వ్యక్తిగత దివాలా చర్యలు చేపట్టడానికి అనుమతించాలని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దాఖలు చేసిన అప్పిలేట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చి న స్టేను తొలగించాలనీ ఎస్బీఐ చేసిన విజ్ఞప్తికి న్యాయమూర్తులు ఎల్ఎన్ రావు, హేమంత్ గుప్తా, ఎస్. రవీంద్ర భట్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. అయితే ఈ అంశానికి ఉన్న ప్రాధాన్యత రీత్యా, తదుపరి విచారణలు ఏమీ లేకుండా అక్టోబర్ 6న కేసు విచారణను చేపట్టి తుది తీర్పు ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం ఢిల్లీ హై కోర్టుకు సూచించడం ఈ కేసులో మరో కీలకాంశం. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏదైనా మార్పు కోరుకుంటే, సంబంధిత న్యాయస్థానాన్నే ఆశ్రయించవచ్చని కూడా ఎస్బీఐకి ధర్మాసనం సూచించింది. వివరాల్లోకి వెళ్తే..: ఆర్‌కామ్, రిలయన్స్ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్‌టీఐఎల్)కు 2016 ఆగస్టులో ఎస్బీఐ రుణం మంజూరు చేసింది. ఆర్‌కామ్‌కు రూ. 565 కోట్లు, ఆర్‌టీఐఎల్‌కు రూ. 635 కోట్లు రుణం అందింది. ఈ రుణం మొండిబకాయిగా మారడంతో, అనిల్ అంబానీ ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తును ఎస్బీఐ రుణ బాకీల కింద జప్తు చేసుకోవాలని నిర్ణయించింది. తదుపరి అనిల్ అంబానీకి నోటీసులు కూడా జారీ చేసినప్పటికీ స్పందన రాలేదు. దీనితో ఎన్సీఎల్టీ, ముంబై బెంచ్‌ని ఆశ్రయించింది. గ్యారంటర్‌పైనా విచారణ జరపవచ్చని నిబంధనల్లో స్పష్టంగా ఉందని తన వాదనల్లో పేర్కొంది. దీంతో ఏకీభవిస్తూ, ఎన్సీఎల్టీ అనిల్ ఆస్తులపై దివాలా ప్రక్రియకు వీలుగా మధ్యంతర పరిష్కార నిపుణుడి (ఆర్పీ)ని నియమి స్తూ ఆగస్టు 21న ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు అదేనెల 27న స్టే ఇస్తూ, తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేసింది. ఈ స్టే ఉత్తర్వు్యను ఎస్బీఐ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
అనిల్ అంబానీపై దివాలా చర్యల నిలుపుదల
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) అధినేత అనిల్ అంబానీపై దాదాపు రూ. 1,200 కోట్ల రుణాల ఎగవేతలకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ వేసిన కేసులో మధ్యంతర పరిష్కార నిపుణుడి (ఆర్పీ)ని నియమిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఇచ్చిన ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు గురువారం స్టే ఇచ్చింది. అయితే ఈ కేసులో ఆయన ఆస్తులపై తీవ్ర ఆంక్షలు విధించింది. వాటిని బదలాయించడంగానీ లేక విక్రయించడంగానీ లేదా తాకట్టు పెట్టడంకానీ చేయరాదని స్పష్టం చేసింది. ఆస్తులకు సంబంధించి ఆయన ప్రయోజనాల్లో ఎటువంటి మార్పులూ జరగరాదని ఆదేశించింది. జస్టిస్ విపిన్ సంఘీ, రజ్నీష్లతో కూడిన త్రిసభ్య ధర్మానసం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో తమ వాదనలు తెలియజేయాలని ఇన్సా ల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ), ఎస్బీఐలకు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదావేస్తూ, ఆలోపు తమ వాదనలు తెలపాలని ప్రతివాదులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే కంపెనీలపై ఈ లోపు తగిన న్యాయపరమైన చర్యలు కొనసాగుతాయని, ఐబీసీ పార్ట్ 3 కింద అంబానీ పిటిషన్ విషయంలో మాత్రమే స్టే విధిస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది. వివరాల్లోకి వెడితే.. అనిల్ అంబానీ గ్రూప్ (అడాగ్)లో భాగమైన ఆర్‌కామ్, రిలయన్స్ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్‌టీఐఎల్)కు 2016 ఆగస్టులో ఎస్బీఐ రుణ సదుపాయం కల్పించింది. ఆర్‌కామ్‌కు రూ. 565 కోట్లు, ఆర్‌టీఐఎల్‌కు రూ. 635 కోట్లు రుణంగా అందించింది. 2016 సెప్టెంబర్‌లో అనిల్ అంబానీ వ్యక్తిగత పూరీకత్తునిచ్చారు. అయితే, 2016 ఆగస్టు నుంచి వర్తింపజేస్తూ ఆర్‌కామ్, ఆర్ఐటీఎల్ ఖాతాలను 2017లో మొండిపద్దుల కింద బ్యాంకులు వర్గీకరించాయి. దీంతో అనిల్ అంబానీ ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తును 2018 జనవరిలో ఎస్బీఐ రుణ బాకీల కింద జప్తు చేసుకోవాలని నిర్ణయించింది. తదుపరి అనిల్ అంబానీకి నోటీసులు కూడా జారీ చేసినప్పటికీ స్పందన రాలేదు. ఈలోగా ఆర్కామ్నకు ఇచ్చిన రూ. 5,447 కోట్లు వసూలు చేసుకునేందుకు చైనా బ్యాంకులకు బ్రిటన్ కోర్టుల నుంచి అనుమతులు లభించాయి. ఒకవేళ చైనా బ్యాంకులు కూడా అనిల్ అంబానీ ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తులపై చర్యలు ప్రారంభిస్తే పరిస్థితి సంక్లిష్టంగా మారుతుందని ఎస్బీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. దివాలా ప్రక్రియకు సమాంతరంగా గ్యారెంటర్‌పై కూడా విచారణ జరపవచ్చని నిబంధనల్లో స్పష్టంగా ఉందని తన వాదనల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో మధ్యంతర పరిష్కార నిపుణుడి (ఆర్పీ)ని నియమిస్తూ ఎన్సీఎల్టీ ఈ నెల 20న ఆదేశాలు ఇచ్చింది. -
అంబానీకి దెబ్బమీద దెబ్బ
సాక్షి,ముంబయి: అనిల్ ధీరూబాయి అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు దెబ్బమీద దెబ్బ పడుతోంది. భారీ అప్పులతో సంక్షోభంలో పడిపోయిన ఆర్‌కాంపై చైనా డెవలప్మెంట్ బ్యాంకు (సీడీబీ) కేసు ఫైల్ చేసింది. భారీ రుణాలను చెల్లించడంలో ఆర్‌కాం విఫలం కావడంతో సీడీబీ ఈ నిర్ణయం తీసుకుంది. సుమారు రూ.11,593 కోట్ల మేర ఇన్ సాల్వెన్సీ కేసు దాఖలు చేసినట్టు బ్యాంకు ప్రకటించింది. ఈ మేరకు ఆర్‌కాంకు నోటీసులు పంపినట్టు తెలిపింది. రిలయన్స్కమ్యూనికేషన్స్కు 1.78 బిలియన్ డాలర్ల రుణాన్ని ఇచ్చిన చైనా డెవలప్మెంట్ బ్యాంక్, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబయి బెంచ్ లో దావా వేసింది. ఇప్పటికే రుణ పరిష్కారంపై పనిచేస్తున్న భారతీయ రుణదాతలు తమ పిటిషన్‌ను వ్యతిరేకించే అవకాశం ఉందని సీడీబీ వర్గాలు అంచనా వేశాయి. ఈ వార్తలతో మంగళవారం నాటి మార్కెట్లో ఆర్‌కాం కౌంటర్ భారీగా నష్టపోయింది. దివాలా నియమావళి (ఐబిసి) ప్రకారం, ఒక సంస్థపై ఎన్సీఎల్టీకి ఫిర్యాదు చేస్తే.. ఆ ఫిర్యాదును కోర్టు సానుకూలంగా స్వీకరిస్తే.. ప్రొఫెషనల్ పరిష్కార కమిటీనీ ఏర్పాటు చేయనుంది. దీంతోపాటు ఆర్‌కాం డైరెక్టర్ల బోర్డును రద్దు చేస్తుంది. అనంతరం ఈ కంపెనీ ఆర్‌కాం ఆస్తుల వేలానికి పిలుపునిచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఈ వార్తలపై ఆర్‌కామ్ వివరణ ఇచ్చింది. చైనా డెవలప్మెంట్ బ్యాంకు దరఖాస్తు చేసినట్టు ట్రైబ్యునల్ నుంచి తమకు ఎలాంటి నోటీసులు అందలేదని పేర్కొంది. -
జేపీ గృహవినియోగదారులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : నోయిడాలోని జేపీ ఇన్ఫోటెక్ గృహ వినియోగదారులకు సుప్రీంకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. అంతకముందు విచారణ సందర్భంగా జేపీ ఇన్ఫ్రాటెక్పై చేపట్టిన దివాలా ప్రొసీడింగ్స్‌పై స్టే విధించిన సుప్రీంకోర్టు, సోమవారం వెలువరించిన తీర్పులో అక్టోబర్ 27 వరకు 2000 కోట్ల రూపాయలను తమ రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని ఈ సంస్థను ఆదేశించింది. అంతేకాక ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌ను, ఇతర డైరెక్టర్లను దేశం విడిచి పారిపోకుండా నిర్భంధిస్తున్నట్టు పేర్కొంది. మేనేజ్మెంట్ను టేకోవర్ చేసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్(ఎన్సీఎల్టీ) ఏర్పాటుచేసిన తాత్కాలిక పరిష్కార ప్రొఫెషనల్( ఐఆర్పీ) బాడీని ఆదేశించింది. ఫ్లాట్ కొనుగోలుదారుల, క్రెడిటార్ల ప్రయోజనాలను ఎలా రక్షిస్తారో 45 రోజుల్లో తమకు తెలుపాలంటూ ఐఆర్‌పీని ఆదేశించింది. ఈ మేరకు ఓ రిజుల్యూషన్ ప్రణాళికను సమర్పించాలని కూడా తెలిపింది.. సుప్రీంకోర్టు సోమవారం జారీచేసిన ఆదేశాల మేరకు జేపీ అసోసియేట్స్ సిస్టర్ కంపెనీ జేపీ ఇన్ఫ్రాటెక్ మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్లు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి విదేశాలకు వెళ్లడానికి లేదు. అయితే డిపాజిట్ చేయాల్సిన రూ.2000 కోట్ల కోసం భూమి విక్రయాలు లేదా ఐఆర్పీ అనుమతితో ఏ ప్రాపర్టీనైనాన విక్రయించుకోవచ్చని అపెక్స్ కోర్టు తెలిపింది. సెప్టెంబర్ 4న ఈ కంపెనీపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ జారీచేసిన దివాలా చట్ట విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే.