రెండు రోజులుగా పెరుగుదల దిశగా సాగుతున్న బంగారం, వెండి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. దీంతో నిన్నటి ధరలే ఈ రోజు కొనసాగుతున్నాయి. ఈ కథనంలో దేశ వ్యాప్తంగా ఈ రోజు (ఆగష్టు 11) గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయనేది వివరంగా తెలుసుకుందాం.
విజయవాడ, హైదరాబాద్‌లలో ఈ రోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64450 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 70310 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాలలో మాదిరిగానే చెన్నైలో కూడా బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. అంటే నిన్నటి ధరలే ఈ రోజు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64450 కాగా, 24 క్యారెట్స్ తులం పసిడి ధర రూ. 70310 వద్దకు చేరాయి.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 64600 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70460 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి ధరలే ఈ రోజు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
వెండి ధరలు
బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా ఏ మాత్రం పెరగలేదు, తగ్గలేదు. శనివారం రూ. 100 పెరిగిన వెండి ధర.. ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దీంతో వెండి రేటు రూ. 83100 దగ్గరే ఆగింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
Comments
Please login to add a commentAdd a comment