ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి.. చుక్కలు తాకిన కొత్త ధరలు! | Today Gold And Silver Prices September 13th, 2024 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి.. చుక్కలు తాకిన కొత్త ధరలు!

Published Fri, Sep 13 2024 11:55 AM | Last Updated on Fri, Sep 13 2024 12:28 PM

Gold and Silver Price Today 13th September 2024

సెప్టెంబర్ ప్రారంభం నుంచి పెరుగుతూ.. తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. దీంతో గోల్డ్ రేటు శుక్రవారం రూ. 1300 వరకు పెరిగింది. దీంతో తులం బంగారం రూ.75000 చేరువకు చేరిపోయింది. ఈ రోజు దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో..

హదరాబాద్,  విజయవాడ, బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో ఈ రోజు (సెప్టెంబర్ 13) పసిడి ధరలు వరుసగా రూ. 1200 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 1300 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. దీంతో తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 68250 వద్ద, 24 క్యారెట్ల పసిడి ధర రూ.74450 వద్ద ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 68250 & 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 74450గా ఉంది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధర నిన్నటి కంటే కూడా రూ. 1200, రూ. 1300 పెరిగినట్లు స్పష్టమవుతోంది.

దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు వరుసగా రూ. 68400 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.74600 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 100 తగ్గిన గోల్డ్ రేటు ఈ రోజు వరుసగా రూ. 1200, రూ. 1300 పెరిగింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో ధరలు కొంత అధికంగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.

వెండి ధరలు
బంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. నిన్న రూ. 91,500 వద్ద స్థిరంగా ఉన్న వెండి.. ఈ రోజు రూ. 3500 పెరుగుదలతో రూ. 95000 (కేజీ) వద్ద నిలిచింది. ఇదే ధరలు దేశంలోని వివిధ నగరాల్లో కూడా ఉంటాయి. ధరలు ఇలాగే కొనసాగితే.. కేజీ సిల్వర్ రేటు లక్ష రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ధీమాగా బీమా.. ఇలా!

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement