వారం రోజులుగా పడుతూ లేస్తూ ఉన్న బంగారం ధరలు ఈ రోజు (మంగళవారం) తగ్గిందా? అనుమానం రేకెత్తించింది. ఎందుకంటే తులం ధర కేవలం రూ. 10 మాత్రమే తగ్గింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడా వివరంగా తెలుసుకుందాం.
విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఈ రోజు రూ. 67,090 వద్ద. . 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ. 73,180 వద్ద ఉంది. నిన్నటి ధరలు పోలిస్తే ఈ రోజు ధరలు కేవలం రూ.10 మాత్రమే తగ్గింది.
ఇక చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. కాబట్టి 22 క్యారెట్ల 10 గ్రా గోల్డ్ రేటు రూ. 66940, 24 క్యారెట్ల 10 గ్రా బంగారం ధర రూ. 73030గా ఉంది. నిన్న, మొన్న స్థిరంగా ఉన్న బంగారం రెండు రోజుల తరువాత కేవలం రూ.10 తగ్గింది.
దేశ రాజధానిలో కూడా 10 గ్రా 22 క్యారెట్స్ & 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ.10 తగ్గింది. దీంతో పసిడి ధరలు రూ. 67090 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 73180 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం రేటు.. ఈ రోజు మాత్రం స్వల్పంగా మాత్రమే తగ్గింది.
వెండి ధరలు
దేశంలో బంగారం ధరలు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ.. వెండి మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్లు దూసుకెళ్తోంది. దీంతో సిల్వర్ రేటు మళ్ళీ గరిష్టాలకు చేరింది. ఈ రోజు (ఆగష్టు 27) కేజీ వెండి రేటు రూ. 600 పెరిగి రూ. 93500 వద్ద నిలిచింది. అయితే వెండి ధర ఢిల్లీలో మాత్రం రూ. 88500 వద్ద ఉంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
Comments
Please login to add a commentAdd a comment