దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. క్రితం రోజున భారీ పెరుగుదలను చూసిన బంగారం నేడు (మే 3) గణనీయంగా తగ్గింది. ఏకంగా రూ.1090 మేర తగ్గడంతో ఈరోజు కొనుగోలు చేస్తున్నవారికి పెద్ద ఊరట కలిగింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నంలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.500 తగ్గి రూ.65,750 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి కూడా ధర రూ.540 తగ్గి రూ. 71,730 లకు దిగొచ్చింది.
ఇతర నగరాల్లో..
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 తగ్గి రూ.65,900 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.540 తగ్గి రూ.71,880 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.500 క్షీణించి రూ.65,750 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 తగ్గి రూ.71,730 వద్దకు క్షీణించింది.
చెన్నైలో భారీగా..
చెన్నైలో ఈరోజు బంగారం ధర భారీగా తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.1000 తగ్గి రూ.66,150 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.1090 తగ్గి రూ.72,160గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 క్షీణించి రూ.65,750 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 తగ్గి రూ.71,730 లకు తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment