దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. మూడు రోజులుగా వరసగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఈరోజు (మే 8) బంగారం ధరలు స్వల్పంగా తగ్గి పసిడి ప్రియులకు కాస్త ఉపశమనం కలిగించాయి.
హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,250 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.100 తగ్గి రూ. 72,270 లకు దిగొచ్చింది.
ఇతర ప్రధాన నగరాల్లో..
➤ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,400 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.100 దిగొచ్చి రూ.72,420 లకు చేరింది.
➤ ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,250 వద్ద, 24 క్యారెట్ల స్వర్ణం రూ.100 క్షీణించి రూ.72,270 వద్దకు తగ్గింది.
➤ బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,250 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.100 తగ్గి రూ.72,270 లకు దిగొచ్చింది.
➤ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,300 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.100 తగ్గి రూ.72,330 లకు దిగొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment