అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితులు చివరకు కార్పొరేట్ రంగంలోనూ ప్రవేశించాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ భయాలు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలో నిరసనగళం వినిపించింది. గూగుల్ ఉద్యోగులు కంపెనీ క్లౌడ్ సీఈఓనే ఎదురించేస్థాయికి వెళ్లారు. ఏకంగా రూ.10వేల కోట్ల ప్రాజెక్ట్‌ను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. దాంతో చివరకు అలా నిరసనకు దిగిన ఉద్యోగులు అరెస్టయిన ఘటన ఇటీవల గూగుల్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
హమాస్-గాజా మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో తాజాగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఈ సెగ చివరకు కార్పొరేట్ సంస్థలను తాకింది. ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్ ఉద్యోగుల్లో కొందరు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా కాలిఫోర్నియా కార్యాలయంలోని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ఛాంబర్‌ను చుట్టుముట్టారు. ఇజ్రాయెల్ దేశంతో కంపెనీ చేసుకున్న ఒప్పందాలను వెంటనే నిలిపేయాలని నిరసన గళం వినిపించారు. దాదాపు ఈ నిరసన 8 గంటలపాటు సాగింది. ఈమేరకు లైవ్‌లో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
⚡️⚡️28 employees entered Google CEO’s office and threatened to stay there until Google canceled its $1.2 billion contract with the Israeli government.
— Megh Updates 🚨™ (@MeghUpdates) April 18, 2024
Instead, Google has FIRED all of them from jobpic.twitter.com/LZSrksIY1U
డిమాండ్‌లో పాల్గొన్న ఉద్యోగులను అడ్మినిస్ట్రేటివ్ లీవ్‌లో ఉంచినట్లు కంపెనీ తెలిపింది. అయినా అక్కడి నుంచి ఏమాత్రం నిరసన విరమించుకోకపోవడంతో చర్యలు చేపట్టింది. ఉద్యోగుల వ్యవహారంతో చేసేదేమిలేక గూగుల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు.
ఉద్యోగులు తీసిన వీడియోలో వారు కూర్చున్న గది ముందు ‘డ్రాప్‌నింబుస్’ బ్యానర్ కనిపిస్తుంది. ఇజ్రాయెల్ ప్రభుత్వంతో గతంలో గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. దాని పేరు ‘ప్రాజెక్ట్ నింబుస్’. దాని విలువ 1.2 బిలియన్ డాలర్లు(రూ.10 వేలకోట్లు). అయితే ఆ దేశంతో చేసుకున్న ఈ ఒప్పందాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ముస్లిం ఉద్యోగులపై వేధింపులు ఆపాలని కోరారు. వారిపై బెదిరింపులకు పాల్పడకూడదని, ఆ వ్యవహారాన్ని సమరస్యంగా పరిష్యరించాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యోగుల వ్యవహారానికి సంబంధించి కంపెనీ ఘాటుగానే స్పందించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఈ నిరసనలో పాల్గొన్ని దాదాపు 28 మందిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: భారత్‌లో సోలార్ సొల్యూషన్స్ అందిస్తున్న నం.1 కంపెనీ
BREAKING: Google employees were arrested after occupying their boss's office for more than 8 hours to demand that the company sever ties with Israel.
— Kassy Akiva (@KassyDillon) April 17, 2024
WATCH: pic.twitter.com/W4WQO8NNgH
Comments
Please login to add a commentAdd a comment