కార్పొరేట్లకు ప్రభుత్వ ఆదేశాలు
స్టార్టప్‌లకు ఇన్‌క్యుబేషన్ సెంటర్లు
న్యూఢిల్లీ: తయారీ రంగానికి దన్నునివ్వమంటూ 100కుపైగా దేశీ కార్పొరేట్ దిగ్గజాలు, యూనికార్న్‌లకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇందుకు అనుగుణంగా స్టార్టప్‌లకు ఇన్‌క్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించింది. కార్పొరేట్ దిగ్గజాల జాబితాలో టాటా, హ్యుందాయ్, యాపిల్ తదితరాలున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు.
ఆయా కంపెనీలకు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) కార్పొరేట్ ఇన్‌క్యుబేషన్, యాక్సెలరేషన్‌పై హ్యాండ్‌బుక్‌ను అందించినట్లు వెల్లడించారు. సొంత తయారీ ఇన్‌క్యుబేటర్లను ఏర్పాటు చేసుకోవలసిందిగా 100కుపైగా సంస్థలను కోరినట్లు తెలియజేశారు.
ఈ జాబితాలో కార్పొరేట్ దిగ్గజాలతోపాటు యూనికార్న్‌లు సైతం ఉన్నట్లు పేర్కొన్నారు. సమీప భవిష్యత్‌లో ఇలాంటి 50 సంస్థల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ నేషనల్ కౌన్సిల్ ఇప్పటికే ఒక కేంద్రానికి తెరతీసినట్లు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment