Incubation
-
తయారీ రంగానికి దన్నునివ్వండి
న్యూఢిల్లీ: తయారీ రంగానికి దన్నునివ్వమంటూ 100కుపైగా దేశీ కార్పొరేట్ దిగ్గజాలు, యూనికార్న్‌లకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇందుకు అనుగుణంగా స్టార్టప్‌లకు ఇన్క్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించింది. కార్పొరేట్ దిగ్గజాల జాబితాలో టాటా, హ్యుందాయ్, యాపిల్ తదితరాలున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఆయా కంపెనీలకు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) కార్పొరేట్ ఇన్క్యుబేషన్, యాక్సెలరేషన్పై హ్యాండ్‌బుక్‌ను అందించినట్లు వెల్లడించారు. సొంత తయారీ ఇన్క్యుబేటర్లను ఏర్పాటు చేసుకోవలసిందిగా 100కుపైగా సంస్థలను కోరినట్లు తెలియజేశారు. ఈ జాబితాలో కార్పొరేట్ దిగ్గజాలతోపాటు యూనికార్న్‌లు సైతం ఉన్నట్లు పేర్కొన్నారు. సమీప భవిష్యత్‌లో ఇలాంటి 50 సంస్థల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ నేషనల్ కౌన్సిల్ ఇప్పటికే ఒక కేంద్రానికి తెరతీసినట్లు తెలియజేశారు. -
గుడ్డు నుంచి పిల్ల వరకు..
పాలమూరు యూనివర్సిటీలోని ఓ చెట్టుకు ఈ స్పైడర్ హంటర్ పక్షి గూడు కట్టడం నుంచి, అందులో గుడ్లు పెట్టి, పొదిగి పిల్లలు బయటికి వచ్చే వరకు వివిధ దశలను ‘సాక్షి’తన కెమెరాలో బంధించింది. ఈ పక్షికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పాలమూరు యూనివర్సిటీ జువాలజీ అధ్యాపకుడు రాజశేఖర్ ‘సాక్షి’తో పంచుకున్నారు. ఈ పక్షి సైంటిఫిక్ పేరు ఆర్చినొతిరా లాంగిరోస్ట్రా. ఇంగ్లిష్ పేరు సన్బర్డు. సాధారణంగా స్పైడర్ హంటర్ అని పిలుస్తారని, ఈ పక్షి చిన్నపాటి చెట్లపై గూడు పెట్టి వర్షాకాలం ప్రారంభంలో కేవలం 15 నుంచి 16 రోజుల్లోనే గుడ్లు పెట్టి పొదిగి పిల్లలకు జన్మనిస్తాయని వెల్లడించారు. – మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ -
తొలి కాన్పులోనే ముగ్గురు.. అందరూ బంగారుతల్లులే
కొత్తగూడెం రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ మహిళ మొదటి కాన్పులోనే ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. జిల్లాలోని సుజాతనగర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ వీర్ల డాంగీ భార్య లావణ్య శనివారం పురిటి నొప్పులతో కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. లావణ్యకు డాక్టర్ ఐశ్వర్య ఆపరేషన్ చేయగా ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. తల్లి, ముగ్గురు శిశువులు క్షేమంగా ఉన్నారని డాక్టర్ తెలిపారు. ఒకే కాన్పులో ముగ్గురు పుట్టడం అరుదైన ఘటన అని పేర్కొన్నారు. చదవండి: అందరికీ ఉచితంగా టీకా: సీఎం కేసీఆర్ చదవండి: దొరక్క దొరికిన ఆస్పత్రి బెడ్.. అంతలోనే -
కలాలతో కలలకు ఊపిరి..!
కేరళ విద్యార్థులపై వరదలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు చెరిపేసే ఈ కార్యక్రమం వినూత్నమేకాదు అందరి ప్రశంసలనూ అందుకుంటోంది. భారీ వర్షాలు, వరదల తదనంతర పరిణామాల్లో భాగంగా ఆ విద్యార్థులు తమకిష్టమైన చదువును కొనసాగించేందుకు భరోసా ఇస్తోంది. వరదనీళ్లలో వారు కోల్పోయిన క్లాస్ పుస్తకాలు, వివిధ సబ్జెకుల వారీగా ఇప్పటికే పూర్తయిన క్లాస్‌లకు నోట్స్‌లు (స్టడీమెటీరియల్) రాసి అందించడం ద్వారా వారి చదువులకు ఊపిరిపోస్తున్నారు. అనాథశరణాలయానికి చెందిన పిల్లలిచ్చిన సలహాలు, సూచనలతో కాలికట్కు చెందిన ‘ఇన్క్యుబేషన్’ స్వచ్ఛంద సంస్థ ఈ పనిని భుజానవేసుకుంది ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు చదువు నష్టపోకుండా ఉండేందుకు వరదల్లో వారు కోల్పోయిన క్లాస్ నోట్స్‌ను అందించేందుకు నడుం బిగించారు. ముందుగా వివిధ తరగతుల విద్యార్థులకు సంబంధించిన క్లాస్‌నోట్స్ రాసివ్వాలంటూ సామాజికమాధ్యమాల ద్వారా మెసేజ్ పంపించారు. అది వైరల్‌గా మారింది. ఈ ఆలోచననను వ్యక్తులు, కంపెనీలు, విద్యాసంస్థలు స్వాగతించాయి. వివిధ తరగతులు,సబ్జెక్టుల వారీగా సోషల్ మీడియా వేదికగా పీడీఎఫ్ ఫార్మాట్లో నోట్స్ పంపిణీలోకి వచ్చాయి. ఒకరి నుంచి మరొకరికి ఇవి ఫార్వర్డ్ అయ్యాయి. దీనిపై ఇతరజిల్లాల నుంచి స్పందించే వారి సంఖ్య పెరిగింది. ఒక్క కేరళకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలకు విదేశాలకు కూడా ఈ వినూత్న అభ్యర్థన చేరుకుంది. ఫలితంగా వేలాది పుస్తకాలు గవర్నమెంట్ స్కూళ్ల విద్యార్థులకు పంపిణీ అయ్యాయి. దాదాపు రెండువారాల పాటు కొనసాగించిన క్యాంపెయిన్‌కు అనూహ్య స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా తమ సంస్థ వివిధ జిల్లాల్లో దాదాపు పదివేలకు పైగా నోట్‌పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేసినట్టు ‘ఇన్క్యుబేషన్’కు చెదిన నాబీల్ మహ్మద్ తెలియజేశారు. ‘జిరాక్సో, ప్రింట్ చేసిన నోట్ పుస్తకాల కంటే చేతిరాతతో రాసిన పుస్తకాల ద్వారా ప్రేమాభిమానాలు పంచాలనేది మా అభిప్రాయం ’ అని ఈ సంస్థ సమన్వయకర్త ఇల్యాస్ జాన్ తెలిపారు. అనారోగ్యం బారిన పడిన కొందరు ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా ఈ నోట్స్రాసి రాయడం ఒక ఎత్తయితే. ఓ శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్న నమితా హర్ష్ అనే మాజీ సాఫ్ట్వేర్ ఉద్యోగిని కూడా ఎనిమిది నోట్‌పుస్తకాలు రాయడం మరో విశేషం. ఈ నోట్‌పుస్తకాలను కేరళలోని వివిధ ప్రాంతాలకు ఉచితంగా అందించడానికి కొన్ని కొరియర్ కంపెనీలు ముందుకొచ్చాయి. ఇక రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థయితే పుస్తకాలు రాష్ట్రంలోని అన్ని ›ప్రాంతాలకు రవాణా చేసింది. దీని కోసం వివిధ జిల్లాల్లోని తమ బస్సుడిపోల్లో ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. నోట్స్ రాసే కార్యక్రమంలో తాము పాలుపంచు కుంటామంటూ వివిధ వర్గాల ప్రజల నుంచి ఇప్పటికీ ఈ సంస్థలకు విజ్ఞప్తులు అందుతూనే ఉన్నాయి. -
హైదరాబాద్‌లో ఫ్లెక్స్ఐ ఇంకుబేటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న యూకే కంపెనీ ఫ్లెక్స్ఐ హైపర్క్యాట్ ఇంకుబేషన్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ), స్మార్ట్ సిటీస్ రంగంలో నిమగ్నమైన స్టార్టప్‌లను తదుపరి స్థాయికి తీసుకెళ్లడమే ఈ కేంద్రం ముఖ్య ఉద్ధేశం. 40 స్టార్టప్‌లకు ఇక్కడ స్థలం ఉంది. వినూత్న వ్యాపార ఆలోచన తో వచ్చిన స్టార్టప్‌లకు నిధులను కూడా సమకూరుస్తామని ఫ్లెక్స్ఐ ఇండియా ఎండీ శ్రీని చిలుకూరి తెలిపారు. ఇంకుబేషన్ కేంద్రంలో కార్యకలాపాలు సాగించే స్టార్టప్‌లకు అన్ని సౌకర్యాలు ఉచితమని ఫ్లెక్స్ఐ, హైపర్క్యాట్ చైర్మన్ జస్టిన్ ఆండర్సన్ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం టెక్నాలజీకి పెద్ద పీట వేస్తోందని, టీ-హబ్ ఏర్పాటైన నేపథ్యంలో సరైన సమయంలో ఈ ఇంకుబేషన్ కేంద్రం వచ్చిందని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ మెక్ ఆలిస్టర్ అన్నారు. యూకే ప్రభుత్వం మద్ధతు ఇస్తున్న స్వచ్చంద సంస్థ హైపర్క్యాట్కు ఫ్లెక్స్ఐ నేతృత్వంలో బ్రిటిష్ టెలికం, కేపీఎంజీ, సిమాంటెక్, సిస్కో వంటి 700 కంపెనీలు నిధులు సమకూరుస్తున్నాయి. -
పుట్టగొడుగులు పెంచుదామా..
పుట్టగొడుగుల పెంపకం ఇలా.. పుట్టగొడుగులను వరిగడ్డి, చిట్టు, తవుడు, చెరకు దవ్వ, జొన్నచొప్ప లాంటి ఏ రరమైన వ్యవసాయ పదార్థాల పైనైనా పెంచవచ్చు. వీటిలో లిగ్నిస్, సెల్యులోజ్ అధికంగా ఉంటుంది. పెంచే పద్ధతి కూడా చాలా సులువైనది. ప్రారంభ పెట్టుబడి తక్కువగానే ఉంటుంది. ఏమేం సామగ్రి కావాలంటే.. పూరిపాక, గది లేక పక్కా షెడ్, వినియోగంలోని కోళ్ల షెడ్ అయినా ఫర్వాలేదు. గడ్డి కత్తిరించడానికి కట్టర్, వేలాడదీయడానికి ఏర్పాటు అంటే పైకప్పుకు కడ్డీలు లేక కొక్కేలు లేక 3-4 అరలున్న చెక్క ర్యాక్, గడ్డిని ఉడకబెట్టడానికి పెద్ద పాత్ర, నాణ్యమైన స్పాన్(పుట్టగొడుగుల విత్తనం) బెడ్స్‌పై గదిలో ఇసుక, గోనె సంచులపై నీరు చల్లడానికి స్ప్రేయర్లు, మంచి ఎండుగడ్డి, జొన్పచొప్ప, వరి ఊక, బెడ్స్ తయారీకి పాలిథిన్ సంచులు, సంచుల మూతులు కట్టడానికి దారం లేక రబ్బరు బ్యాండ్లు, థర్మామీటర్, హైగ్రోమీటర్(ఆర్ధ్రతా మాపకం), చేతులు శుభ్రం చేసుకునేందుకు దూది, స్పిరిట్ లేదా డెటాల్, ఫార్మాలిన్ ద్రావణం అవసరమవుతాయి. సబ్స్ట్రాట్(ఆధారం) తయారు చేసే పద్ధతి నీటిలో ఉడకబెట్టడం ద్వారా సబ్స్ట్రాట్ని స్టెరిలైజ్ చేయవచ్చు. తాజా వరిగడ్డి లేక మరే ఇతర వ్యవసాయ వ్యర్థాన్ని తీసుకుని 2-3 అంగుళాల పొడవున్న ముక్కలుగా కత్తిరించాలి. ఆ ముక్కలను 12-18 గంటల పాటు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత శుభ్రమైన నీటిలో కడగాలి. గడ్డి ముక్కలను స్టెరిలైజ్ చేసేందుకు.. మరుగుతున్న నీరున్న పాత్రలో 30 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అనంతరం వాటిని తీసి చాపలపై పరచాలి. బెడ్స్ తయారీ.. బెడ్స్ తయారీకి పాలిథిన్ సంచులు వాడాలి. 12ఁ18 అంగుళాలు లేదా 100జీ మందంతో 14ఁ24 అంగుళాలు ఉండాలి. గాలి వెళ్లేందుకు వీలుగా పాలీథిన్ సంచులకు 9-15 రంధ్రాలు చేయాలి. చేతులను డెట్టాల్ లేదా స్పిరిట్‌తో శుభ్రం చేసుకోవాలి. స్టెరిలైజ్ చేసిన గడ్డిముక్కలను పొరలు పొరలుగా బ్యాగ్‌లో నింపాలి. ఎక్కడా ఖాళీ లేకుండా గుండ్రంగా ఉండేలా గడ్డిని నొక్కాలి. గుప్పెడు విత్తనాలను(40 గ్రాములు) బెడ్ ఉపరితలంపై ఒకే రీతిలో చల్లాలి. ఈ విధంగా 4-5 పొరలు తయారు చేయాలి. బ్యాగ్ మూడొంతులు నిండాక విత్తనాలను మరోసారి ఉపరితలమంతటా సమంగా చల్లాలి. తర్వాత బ్యాగును దారం లేదా రబ్బరు బ్యాండుతో బిగించి కట్టి, తేదీ రాసిన లేబుల్ అతికించాలి. ఇంక్యుబేషన్, క్రాపింగ్ బెడ్స్‌తో కూడిన సంచులను చీకటిగా ఉన్న గదిలో వేలాడదీయడమో లేదా షెల్ఫ్ పై పెట్టడమో చేయాలి. ఆ విధంగా ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు. వ్యాధులు, పురుగులను నివారించవచ్చు. ఇంటిలో ఒకమూల భాగాన్నయినా ఇందుకోసం వాడుకోవచ్చు. బెడ్స్‌పై ఉన్న సంచులను ర్యాక్‌లపై ఉంచాలి లేదా కొక్కేలకు వేలాడదీయాలి. 18-25 రోజులపాటు బెడ్స్‌ను ఉంచాలి. ఇంక్యుబేషన్ కాలంలో పాలిథిన్ సంచులలోని బెడ్స్‌పై తెల్లని నూలుదారాల వంటి మైసీలియంలు పెరగడం కనిపిస్తుంది. అప్పుడు ప్లాస్టిక్ కవరును తొలగిస్తే పుట్టగొడుగులు పెరగడానికి వీలుంటుంది. బెడ్స్‌లో తేమ ఉండేలా అప్పుడప్పుడు నీరు చిలకరిస్తూ ఉండాలి. 5-6 రోజుల తర్వాత బెడ్స్ అంతటా సూదిమొనంత ఉన్న పుట్టగొడుగులు కనిపిస్తాయి. 7 నుంచి 10 రోజుల్లో మొదటి పంట కోతకు సిద్ధంగా ఉంటుంది. రేకులు పూర్తిగా విచ్చుకుని అంచులు పలచబడితే ఆ పుట్టగొడుగులు కోతకు వచ్చినట్లే. వాటిని అడుగున కొద్దిగా మెలితిప్పి కాండంతో సహా గిల్లివేయాలి. ఒక్కో దిగుబడిని ప్లస్ అంటారు. వారానికి ఒకసారి కోయాలి. ఒక్కో బెడ్ నుంచి కనీసం 2-3 పంటలను తీయవచ్చు. ఒక్కో బెడ్ నుంచి 500 నుంచి 800 గ్రాముల పుట్టగొడుగులను పొందవచ్చు. తర్వాత బెడ్‌ను తీసివేసి మొక్కలకు ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. పుట్టగొడుగుల్లో రకాలు పుట్టగొడుగుల్లో తినేందుకు వీలైన జాతులు దాదాపు 2 వేల వరకు ఉన్నాయి. వాటిలో మూడు జాతులను మనదేశంలో పెంచుతున్నారు. అవి వైట్ బటన్(అగారికస్ స్పీషిస్), అయిస్టర్ లేక థింగ్రీ(ఫెయిరోటస్ స్పీషిస్), చైనీస్(ఓల్వోరిల్లా స్పీషిస్). వైట్ బటన్ : దీనిని యూరోపియన్ లేక సమశీతోష్ణ(టెంపరేట్) పుట్టగొడుగులు అని కూడా అంటారు. వీటి పెంపకానికి 15-18 డిగ్రీల సెంటిగ్రేడ్ నియంత్రిత ఉష్ణోగ్రత కావాలి. అందుకోసం ఇన్సులేటెడ్ గదులు, ఏసీ ఫ్లాంట్, హ్యుమిడిఫైయర్, ఏహెచ్‌యూ లాంటి యంత్రాలు అవసరం. అందువల్ల పెట్టుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. పెంపకానికి సాంకేతిక నైపుణ్యం అవసరం. ఈ రకాన్ని సాధారణంగా చల్లగా ఉండే కొండ ప్రాంతాల్లో పెంచుతారు. మన రాష్ర్టంలో మైదాన ప్రాంతాల్లో శీతాకాలంలో పెంచుతుంటారు. అయిస్టర్(ముత్యపుచిప్ప) : ఈ రకం పుట్టగొడుగులను చౌకగా లభించే రకరకాల వ్యవసాయ వ్యర్థ పదార్థాలపై పెంచవచ్చు. ఉష్ణోగ్రత 25-32 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండాలి. తేమ శాతం 75-85 ఉండాలి. ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఈ రకాలను మన రాష్ట్రంలో పెంచుకోవచ్చు. చైనీస్ : ఈ రకానికి 35-38 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత, 80-90 శాతం తేమ అవసరం. అత్యధిక ఉష్ణోగ్రత అవసరమైనందున ఈ రకాన్ని వేసవిలో పెంచుకోవచ్చు. -
కొత్త ఆలోచనలతో బ్రాండ్ హైదరాబాద్
ప్రారంభమైన ‘అర్బన్ హ్యాకథాన్’ రాయదుర్గం: ప్రభుత్వంలో ప్రజల్ని భాగస్వాములను చేయడమే ‘అర్బన్ హ్యాకథాన్’ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావు తెలిపారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో శనివారం తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, ది మెట్రో పోలిస్ వరల్డ్ కాంగ్రెస్, ఐఎస్బీ సంయుక్తంగా రెండు రోజులపాటు నిర్వహించే ‘హైదరాబాద్ అర్బన్ హ్యాకథాన్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హ్యాకథాన్‌లో పాల్గొనేందుకు 400 మంది(70 బృందాలు) ఔత్సాహికులు తమ వినూత్న ఆలోచనలతో వచ్చారన్నారు. ఐడియాలను జ్యూరీ పరిశీలించి 20 బృందాలను ఎంపిక చేస్తుందని స్పష్టం చేశారు. ఫైనల్లో ఎంపికైన ఐదు ఐడియాలకు ప్రభుత్వం, ఐఎస్బీ ద్వారా ఇంక్యుబేషన్‌కు అవకాశం కల్పిస్తామని మంత్రి తెలిపారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమే్‌శ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఆలోచనకు ఒక సమయం వస్తుందని, దాన్ని అప్పుడు ఉపయోగించుకున్నప్పుడే సార్థకత చేకూరుతుందన్నారు. అర్బన్ హ్యాకథాన్‌లో మొదటి 20 స్థానాల్లో నిలిచిన వారి ఐడియాలను ‘బ్రాండ్ హైదరాబాద్, బ్రాండ్ తెలంగాణ ’ రూపొందించడంలో భాగస్వామ్యం చేస్తామని వివరించారు. హెచ్ఐసీసీలో అక్టోబర్ 6న మెట్రో పోలిస్ హ్యాకథాన్ ఫైనల్స్ ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ ఎ. బాబు, మెక్స్-స్మార్ట్ సిటీస్ కో ఫౌండర్ అల్ఫాన్సో గోవెలా థామస్ పాల్గొన్నారు.