హైదరాబాద్‌లో ఫ్లెక్స్‌ఐ ఇంకుబేటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న యూకే కంపెనీ ఫ్లెక్స్‌ఐ హైపర్‌క్యాట్ ఇంకుబేషన్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ), స్మార్ట్ సిటీస్ రంగంలో నిమగ్నమైన స్టార్టప్‌లను తదుపరి స్థాయికి తీసుకెళ్లడమే ఈ కేంద్రం ముఖ్య ఉద్ధేశం.
40 స్టార్టప్‌లకు ఇక్కడ స్థలం ఉంది. వినూత్న వ్యాపార ఆలోచన తో వచ్చిన స్టార్టప్‌లకు నిధులను కూడా సమకూరుస్తామని ఫ్లెక్స్‌ఐ ఇండియా ఎండీ శ్రీని చిలుకూరి తెలిపారు. ఇంకుబేషన్ కేంద్రంలో కార్యకలాపాలు సాగించే స్టార్టప్‌లకు అన్ని సౌకర్యాలు ఉచితమని ఫ్లెక్స్‌ఐ, హైపర్‌క్యాట్ చైర్మన్ జస్టిన్ ఆండర్సన్ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం టెక్నాలజీకి పెద్ద పీట వేస్తోందని, టీ-హబ్ ఏర్పాటైన నేపథ్యంలో సరైన సమయంలో ఈ ఇంకుబేషన్ కేంద్రం వచ్చిందని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ మెక్ ఆలిస్టర్ అన్నారు. యూకే ప్రభుత్వం మద్ధతు ఇస్తున్న స్వచ్చంద సంస్థ హైపర్‌క్యాట్‌కు ఫ్లెక్స్‌ఐ నేతృత్వంలో బ్రిటిష్ టెలికం, కేపీఎంజీ, సిమాంటెక్, సిస్కో వంటి 700 కంపెనీలు నిధులు సమకూరుస్తున్నాయి.