
కొత్తగూడెం రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ మహిళ మొదటి కాన్పులోనే ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. జిల్లాలోని సుజాతనగర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ వీర్ల డాంగీ భార్య లావణ్య శనివారం పురిటి నొప్పులతో కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. లావణ్యకు డాక్టర్ ఐశ్వర్య ఆపరేషన్ చేయగా ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. తల్లి, ముగ్గురు శిశువులు క్షేమంగా ఉన్నారని డాక్టర్ తెలిపారు. ఒకే కాన్పులో ముగ్గురు పుట్టడం అరుదైన ఘటన అని పేర్కొన్నారు.
చదవండి: అందరికీ ఉచితంగా టీకా: సీఎం కేసీఆర్
చదవండి: దొరక్క దొరికిన ఆస్పత్రి బెడ్.. అంతలోనే
Comments
Please login to add a commentAdd a comment