కంపెనీ తయారుచేసిన ఉత్పత్తులు ఎంత క్వాలిటీగా ఉన్నా, ఎంత చౌకగా మార్కెట్‌లో విడుదల చేస్తున్నా సరైన ప్రచారం లేకపోతే అనుకున్న లాభాలు ఉండవు. కాబట్టి చాలా కంపెనీలు మోడల్స్, సినీప్రముఖులను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటాయి. వారితో తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకుంటాయి. అయితే మోడల్స్ కంటే కూడా జనాల్లో ఎక్కువ గ్లామర్ ఉన్న సినీ ప్రముఖులకే సంస్థలు బ్రాండ్‌ప్రమోషన్ కోసం ప్రాధాన్యం ఇస్తాయి. ఈమేరకు కార్పొరేట్ మార్కెట్‌లో అల్లుఅర్జున్‌కు ఉన్న బ్రాండ్ విలువ అంతాఇంతా కాదు. పుష్పరాజ్‌కు 2022 సంవత్సరానికిగాను ఏకంగా రూ.260 కోట్ల (3.14 కోట్ల డాలర్లు) బ్రాండ్ విలువ ఉన్నట్లు ఆర్థిక సలహాల సంస్థ క్రోల్ గతంలో విడుదల చేసిన ‘సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ స్టడీ’ నివేదిక ద్వారా తెలిసింది. ఈ రోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా వ్యాపార మార్కెట్‌లో ఆయన గురించిన కొన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
బ్రాండ్ ప్రమోట్ చేస్తున్న కంపెనీలు..
- కోకాకోలా
- ఆస్ట్రాల్ పైప్స్
- కేఎఫ్‌సీ
- జొమాటో
- రెడ్‌బస్
- ఆహా
- జోయాలుక్కాస్
- డిస్నీ హాట్‌స్టార్
- 7అప్
- ఫ్రూటీ
పైన తెలిపిన ఒక్కో బ్రాండ్ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ బ్రాండ్‌కు ఒక్కంటికి సరాసరి రూ.5 కోట్లు-10 కోట్లు సంపాదిస్తున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది.
రియల్ ఎస్టేట్‌లోనూ ‘దేశముదురే’
- అల్లు అర్జున్‌కు హైదరాబాద్‌లో విశాలమైన కార్యాలయం ఉంది.
- జూబ్లీహిల్స్‌లో రూ.100 కోట్లు(మార్కెట్ ధర) విలువ చేసే బంగ్లా.
- ముంబయిలో రెండు పడకగదుల అపార్ట్‌మెంట్.
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.60 కోట్ల విలువచేసే ఇతర స్థిరాస్తులు.
కంపెనీల్లో భాగస్వామ్యం
- అల్లు స్టూడియోస్-ఫిల్మ్ ప్రొడక్షన్
- 800 జూబ్లీ-నైట్ క్లబ్
- బఫెలో వైల్డ్ వింగ్స్(ఫ్రాంచైజ్)-స్పోర్ట్స్ బార్ అండ్ రిస్టారెంట్
- ఏఏఏ సినిమాస్-మోడ్రన్ మల్టీప్లెక్స్
- గీతా ఆర్ట్స్-ప్రొడక్షన్ కంపెనీ
- ఆహా-ఓటీటీ ప్లాట్‌ఫామ్
- హైదరాబాద్ ఆధారిత హెల్త్‌కేర్ స్టార్టప్ ‘కాల్‌హెల్త్’లో పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది.
బన్నీ ప్రయాణానికి లగ్జరీ వాహనాలు
- హార్లీడెవిడ్‌సన్ ఫ్యాట్ బాయ్ బైక్
- వొల్వో ఎక్స్‌సీ90 టీ8 ఎక్సలెన్స్ కారు
- బీఎండబ్ల్యూ ఎక్స్6ఎం కారు
- ప్రైవేట్ జెట్
- రేంజ్‌రోవర్ వోగ్ కారు
- వానిటీ వ్యాన్-ఫాల్కన్.. వీటి ధర సుమారు రూ.85 కోట్ల పైమాటే.
ఇదీ చదవండి: ఒకేనెలలో 76 లక్షల ఖాతాలు తొలగించిన వాట్సప్.. కారణం..
సోషల్ మీడియాలోనూ ఈ ‘రేసుగుర్రం’కు అభిమానుల ఫాలోయింగ్ ఎక్కువే. ఇన్‌స్టాగ్రామ్‌లో 24.4 మిలియన్ల మంది, ట్విటర్(ఎక్స్)లో 8 మిలియన్ల మంది ఈ ‘సరైనోడు’ని అనుసరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment