మన దేశంలోని మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉపయోగించే ప్రజారవాణా ఉంది అంటే అది రైల్వే రవాణా మాత్రమే. తక్కువ మొత్తంతో ఎక్కవ దూరం ప్రయాణించడానికి రైల్వే ప్రయాణం చాలా అనువుగా ఉంటుంది. అలాగే, పండుగ సమయాలలో దీనిలో ప్రయాణించడానికి మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతారు. అయితే, ఇందులో రిజర్వేషన్ టికెట్ బుక్ చేసుకోవడానికి ఐఆర్‌సీటీసీ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. అయితే, అలాంటి ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోతే మాత్రం మీ ఖాతా ద్వారా టికెట్ బుక్ చేయడం కష్టం అవుతుంది. మీరు గనుక మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోతే తిరిగి ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ తిరిగి పొందండి ఇలా..
- మొదట ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి. ఇప్పుడు మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ లాగిన్ ఐడిని నమోదు చేయండి.
- ఆ తర్వాత 'Forgot Password' ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్, ఐఆర్‌సీటీసీ యూజర్ ఐడీ, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ నమోదు చేయండి.
- ఆ తర్వాత ఐఆర్‌సీటీసీ రిజిస్టర్డ్ ఈమెయిల్ చిరునామాకు ఒక మెయిల్ వస్తుంది. దీని ద్వారా మీరు మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ని తేలికగా రికవరీ చేసుకోవచ్చు.
- మీరు మీ ఐఆర్‌సీటీసీ ఖాతాలోకి లాగిన్ అయిన తరువాత మీకు నచ్చిన పాస్‌వర్డ్ నమోదు చేసి ఓకే చేయండి. ఇప్పుడు మీ కొత్త పాస్‌వర్డ్ క్రియేట్ అవుతుంది.
- ఆ తర్వాత మీ ఐఆర్‌సీటీసీ ఖాతాను కొత్త పాస్‌వర్డ్ సహాయంతో ఒకసారి లాగిన్ అవ్వండి.
Comments
Please login to add a commentAdd a comment