forgot password
-
ఐఆర్సీటీసీ అకౌంట్ పాస్వర్డ్ మరిచిపోయారా? ఇలా చేయండి!
మన దేశంలోని మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉపయోగించే ప్రజారవాణా ఉంది అంటే అది రైల్వే రవాణా మాత్రమే. తక్కువ మొత్తంతో ఎక్కవ దూరం ప్రయాణించడానికి రైల్వే ప్రయాణం చాలా అనువుగా ఉంటుంది. అలాగే, పండుగ సమయాలలో దీనిలో ప్రయాణించడానికి మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతారు. అయితే, ఇందులో రిజర్వేషన్ టికెట్ బుక్ చేసుకోవడానికి ఐఆర్సీటీసీ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. అయితే, అలాంటి ఐఆర్సీటీసీ అకౌంట్ పాస్వర్డ్ మర్చిపోతే మాత్రం మీ ఖాతా ద్వారా టికెట్ బుక్ చేయడం కష్టం అవుతుంది. మీరు గనుక మీ ఐఆర్సీటీసీ అకౌంట్ పాస్వర్డ్ మర్చిపోతే తిరిగి ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఐఆర్సీటీసీ అకౌంట్ పాస్వర్డ్ తిరిగి పొందండి ఇలా.. మొదట ఐఆర్సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి. ఇప్పుడు మీ ఐఆర్సీటీసీ అకౌంట్ లాగిన్ ఐడిని నమోదు చేయండి. ఆ తర్వాత 'Forgot Password' ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్, ఐఆర్సీటీసీ యూజర్ ఐడీ, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ నమోదు చేయండి. ఆ తర్వాత ఐఆర్సీటీసీ రిజిస్టర్డ్ ఈమెయిల్ చిరునామాకు ఒక మెయిల్ వస్తుంది. దీని ద్వారా మీరు మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ని తేలికగా రికవరీ చేసుకోవచ్చు. మీరు మీ ఐఆర్సీటీసీ ఖాతాలోకి లాగిన్ అయిన తరువాత మీకు నచ్చిన పాస్వర్డ్ నమోదు చేసి ఓకే చేయండి. ఇప్పుడు మీ కొత్త పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత మీ ఐఆర్సీటీసీ ఖాతాను కొత్త పాస్వర్డ్ సహాయంతో ఒకసారి లాగిన్ అవ్వండి. (చదవండి: కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరు..) -
పాస్వర్డ్ మరిచిపోవడంతో... పది లక్షల కోట్ల రూపాయలు ఆగం...!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీకి మంచి ఆదరణ లభిస్తోంది. బిట్‌కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీలు ప్రజల్లో ఎక్కువగా ప్రాచుర్యాన్ని పొందాయి. క్రిప్టోకరెన్సీ లావాదేవీలు పూర్తిగా ఆన్లైన్లో జరుగుతాయి. శక్తివంతమైన కంప్యూటర్ల సహయంతో, బ్లాక్‌చైన్ టెక్నాలజీనుపయోగించి క్రిప్టో లావాదేవీలను జరుపుతుంటారు. బిట్‌కాయిన్స్‌ను కల్గిన పలు వ్యక్తులు తమ బిట్‌కాయిన్ వ్యాలెట్‌కు పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకోనే సౌకర్యం ఉంటుంది. బిట్‌కాయిన్ వ్యాలెట్‌కు శక్తివంతమైన పాస్వర్డ్ సహాయంతో ఇతరులకు బిట్కాయిన్ల లావాదేవీలను చేయవచ్చును. చదవండి: క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...! పది లక్షల కోట్ల రూపాయలు గాల్లోనే...! బిట్‌కాయిన్ వ్యాలెట్ల పాస్వర్డ్ మర్చిపోతే మాత్రం బిట్‌కాయిన్ యూజర్లు తిరిగి పొందే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒకవేళ బిట్‌కాయిన్ వ్యాలెట్ పాస్వర్డ్ మర్చిపోతే... బిట్కాయిన్లు ఆన్లైన్లో అలానే ఉండిపోతాయి. ది న్యూయర్క్ టైమ్స్ ప్రకారం...దాదాపు 140 బిలియన్ డాలర్లు (రూ. 1,03,66,51,70,00,000 సుమారు పది లక్షల కోట్ల రూపాయలు) బిట్‌కాయిన్ వ్యాలెట్ల పాస్వర్డ్స్ మర్చిపోవడంతో ఈ మొత్తాన్ని బిట్‌కాయిన్ యూజర్లు క్లెయిమ్ చేసుకోలేదని వెల్లడించింది. క్రిప్టోకరెన్సీ డేటా సంస్థ చైనాలిసిస్ నివేదికలో ఈ విషయాలను పేర్కొంది. 18.6 బిలియన్ బిట్కాయిన్ల మైనింగ్‌లో 20 శాతం మేర బిట్‌కాయిన్స్‌లో ఏలాంటి లావాదేవీలు లేకుండా నిద్రాణస్థితిలో ఉన్నాయని తెలిపింది.ఆయా బిట్‌కాయిన్ వ్యాలెట్ల యూజర్లు పాస్‌వర్డ్స్‌ను మర్చిపోవడమే దీనికి కారణమని చైనాలిసిస్ పేర్కొంది. ఆశాదీపంగా హ్యాకర్లే వారికి దిక్కు...! బిట్‌కాయిన్ వ్యాలెట్ల పాస్‌వర్డ్స్‌ను మర్చిపోయినా బిట్‌కాయిన్ యూజర్లకు డార్క్‌వెబ్‌లోని ఆన్లైన్ హ్యాకర్లే దిక్కుగా కన్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయా బిట్‌కాయిన్ వ్యాలెట్లను యాక్సెస్ చేసేందుకు బిట్‌కాయిన్ యూజర్లు హ్యకర్ల సహయాన్ని తీసుకుంటున్నారు. బిట్‌కాయిన్ వ్యాలెట్లను రికవరీ చేసిన హ్యకర్లకు కొత్త మొత్తాన్ని బిట్‌కాయిన్ యూజర్లు చెల్లిస్తున్నట్లు క్రిప్టో అసెట్ రికవరీ టీమ్ వెల్లడించింది. కాగా బిట్‌కాయిన్ వ్యాలెట్లను రికవరీ చేసే సంభావ్యత కేవలం 27 శాతంగానే ఉంది. చదవండి: Bitcoin: అదృష్టమంటే ఇదేనేమో...! తొమ్మిదేళ్లలో రూ. 6 లక్షల నుంచి రూ. 216 కోట్లు...! -
మీ ఫోన్ పాస్వర్డ్ మరిచిపోయారా..! ఇలా చేయండి..
స్మార్ట్‌ఫోన్ మన నిత్య జీవితంలో ఒక భాగమైంది. మన ప్రైవసీ కోసం మొబైల్ ఫోన్లకు పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకుంటాం. పాస్వర్డ్ ఏర్పాటుతో మనకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఏవరి కంటపడకుండా కాపాడుకోవచ్చును. కాగా దురదృష్టవశాత్తు ఫోన్ పాస్వర్డ్ మరిచిపోయారు..అనుకోండి అప్పుడు ఏం చేస్తారు అని అడిగితే...! ఏముంది వెంటనే దగ్గరలో ఉన్న మొబైల్ రిపేర్ సెంటర్లకు తీసుకొని వెళ్తాం..ఫోన్ అన్‌లాక్ చేయించుకుంటాం! రిపేర్ షాపు వాడు అడిగే డబ్బును చెల్లిస్తామంటారా..! మీరు మొబైల్ రిపేర్ షాపుకు వెళ్లకుండా మీ ఇంట్లోనే ఫోన్ ఆన్‌లాక్ చేయడం ఎలానో మీకు తెలుసా.. ఐతే ఇది మీకోసమే..మీ ఆండ్రాయిడ్ ఫోన్ విషయంలో ఫ్యాక్టరీ రిసెట్ చేయడంతో మీ మొబైల్‌ను అన్‌లాక్ చేయవచ్చును. దాంతో పాటుగా గూగుల్ డివైజ్ మెనేజర్‌ను ఉపయోగించి ఫోన్‌ను రిసేట్ చేయవచ్చును. మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఇలా ఫ్యాక్టరీ రిసేట్ చేయండి... స్టెప్ 1: మీ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి, కనీసం ఒక నిమిషం వేచి ఉండండి స్టెప్ 2: పవర్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్‌ను ఒకేసారి కలిసి ప్రెస్ చేయండి. స్టెప్ 3: పవర్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్ ఒకేసారి ప్రెస్ చేయడంతో మీ ఫోన్ రికవరీ మోడ్‌లోకి వెళ్తుంది. అందులో మీకు పలు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో వైప్ డేటా/ ఫ్యాక్టరీ రిసేట్ ఆప్షన్‌ను ఎంపిక చేయండి. మీ మొబైల్ ఫ్యాక్టరీ రిసేట్ అవుతున్న ఆండ్రాయిడ్ సింబల్ కనిపిస్తోంది. స్టెప్ 4: మొబైల్ ఫ్యాక్టరీ రిసేట్ అయ్యేంత వరకు వేచి ఉండండి. రిసేట్ పూర్తి అయ్యాక తిరిగి మీ ఫోన్‌ను స్విచ్ ఆన్ చేయండి. మీరు స్విచ్ ఆన్ చేయగానే మీరు కొన్నప్పుడు మీ మొబైల్ ఫోన్ ఎలా ఉండేదో అలా తిరిగి మీకు కనిపిస్తోంది. ఫోన్ ఆన్ అవ్వగానే భాషను సెలక్ట్ చేసుకోండి అనే ఆప్షను వస్తోంది. దాని తరువాత మీ ఈమెయిల్‌తో లాగిన్ అవ్వమని అడుగుతోంది. ఇప్పుడు మీ ఫోన్‌ను పాస్వర్డ్ లేకుండానే మీ యాక్సెస్ చేయగలరు. గూగుల్ డివైజ్ మేనేజర్ ఉపయోగించి ఇలా ఆన్‌లాక్ చేయండి... స్టెప్ 1: Visit: google.com/android/devicemanager వెబ్‌సైట్‌ను సందర్శించండి స్టెప్ 2: మీ గూగుల్ ఖాతాతో సైన్ ఇన్ చేయండి స్టెప్ 3: అందులో మీ గూగుల్ ఖాతాతో రిజస్టర్ ఐనా గ్యాడ్జెట్లు కనిపిస్తాయి. అందులో మీరు అన్‌లాక్ చేయదలిచిన ఫోన్‌ను ఎంచుకోండి స్టెప్ 4: ఎంచుకున్న ఫోన్లో ఎరేస్ డేటాపై క్లిక్ చేయండి. తిరిగి మీ ఈ-మెయిల్, పాస్‌వర్డ్‌ను అడుగుతోంది. ఎంటర్ చేశాక మీ ఫోన్ పాస్వర్డ్ ఆన్‌లాక్ చేయవచ్చును. మీ డేటా పూర్తిగా ఏరేస్ అవుతుందన్ని బాధపడకండి. తిరిగి మీ ఈ-మెయిల్‌తో మొబైల్ ఫోన్లో లాగిన్ ఐతే మీ డేటాను తిరిగి బ్యాకప్ చేసుకోవచ్చును. -
డీఆర్డీవో పాస్వర్డ్ మర్చిపోయింది?
న్యూఢిల్లీ: ఓ సాధారణ వ్యక్తి తన విలువైన ఆన్లైన్ ఖాతా పాస్వర్డ్ మర్చిపోయాడంటే నమ్మొచ్చు.. లేదా ఓ సంస్థ అలాగే మర్చిపోయిందంటే అవునేమో అనుకోవచ్చు.. కానీ దేశ రక్షణ వ్యవహారాల్లో, దేశ ఆయుధ సంపత్తిని పెంపొందిచే విషయంలో నిత్య నూతన ప్రయోగాలు చేసే భారతదేశ డీఆర్డీవో(డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) తన పాస్‌వర్డ్‌ను మర్చిపోయిందంటే ఇక అవాక్కవక తప్పదేమో.. అవును డీఆర్డీవో తన అధికారిక ఫేస్బుక్ పేజీకి సంబంధించిన పాస్ వర్డ్ ను మర్చిపోయిందంట. ఈ విషయాన్ని స్వయంగా తానే ట్విట్టర్ ద్వారా ఫేస్‌బుక్‌కు తెలియజేసింది. ‘మేం ఇండియన్ డీఆర్డీవో తరుపున మిమ్మల్ని సంప్రదిస్తున్నాం. మా అధికారిక ఫేస్బుక్ పేజీ ఓపెన్ అవడం లేదు’ అంటూ ఫేస్బుక్ కు డీఆర్డీవో ట్వీట్ చేసింది. నిత్యం డీఆర్డీవోను ఫాలో అయ్యే ట్విట్టర్ ఖాతా దారులు కాస్త ఈ ట్వీట్ ను చూసి అవాక్కయ్యారు.