సాక్షి, ముంబై: వైద్యుల బ్యాం కింగ్ అవసరాలను తీర్చే దిశగా ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ కొత్తగా ’సెల్యూట్ డాక్టర్స్’ పేరిట ప్రత్యేక సొల్యూషన్స్‌ను ప్రవేశపెట్టింది. వైద్య విద్యార్థి స్థాయి నుంచి సీనియర్ మెడికల్ కన్సల్టెంట్, ఆస్పత్రి లేదా క్లినిక్ యజమానిగా మారే దాకా ప్రతీ దశలోనూ వారికి అవసరమయ్యే ఆర్థిక సేవలను అందించనున్నట్లు బ్యాంక్ హెడ్ (లయబిలిటీస్) ప్రణవ్ మిశ్రా తెలిపారు. డాక్టర్స్ కోసమే ప్రత్యేకమైన ఫీచర్లతో రూపొందించిన సేవింగ్స్, కరెంటు ఖాతాలు మొదలుకుని గృహ, వ్యాపార, వ్యక్తిగత, వ్యాపార రుణాల దాకా పొందవచ్చని పేర్కొన్నారు. రూ. 1 కోటి దాకా విద్యా రుణం పొందవచ్చని వివరించారు.
ఆఫర్ల వివరాలు:
మెడికల్ ఎక్విప్‌మెంట్ లోన్ : 10 కోట్ల రూపాయల దాకా రుణ సదుపాయం. వారు బ్యాంక్ కస్టమర్లు అయినా కాకపోయినా వైద్యులందరికీ ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. వివరాలకు హెచ్‌సిఎఫ్‌ను 567677 కు SMS చేయవచ్చు.
బిజినెస్ లోన్: మూలధన అవసరాలకు లేదా క్లినిక్ / ఆసుపత్రిని పునరుద్ధరించడం, వైద్య పరికరాల కొనుగోలు వంటి ఇతర వ్యాపార సంబంధిత ఖర్చులకు రూ. 40 లక్షల దాకా వ్యాపార రుణం ప్రీ అప్రూవ్డ్ కస్టమర్లకు తక్షణమే రుణ సదుపాయం.
వ్యక్తిగత రుణం: సాధారణ ఆన్‌లైన్ డాక్యుమెంటేషన్ , ప్రాసెసింగ్‌తో రూ. 25 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు
ఎడ్యుకేషన్ లోన్: ‘డాక్టర్ సెలెక్ట్ ఐస్‌మార్ట్ ఎడ్యుకేషన్ లోన్’ అని పిలిచే ఈ సదుపాయం ద్వారా కోటి రూపాయల వరకు రుణం. ఇంకా 50 లక్షల వరకు ఆటో లోన్‌సదుపాయం ‘ఫ్లెక్సీ ఈఎంఐ’ సౌలభ్యాన్ని కూడా వైద్యులకు అందుబాటులోఉంచినట్టు బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment