రూ.లక్ష కోట్లకు రంగుల పరిశ్రమ | Indian paints and coatings industry estimated to grow to Rs one lakh crore | Sakshi
Sakshi News home page

రూ.లక్ష కోట్లకు రంగుల పరిశ్రమ

Published Thu, Jul 13 2023 5:33 AM | Last Updated on Thu, Jul 13 2023 5:33 AM

Indian paints and coatings industry estimated to grow to Rs one lakh crore - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో పెయింట్స్, కోటింగ్స్‌ పరిశ్రమ పరిమాణం వచ్చే ఐదేళ్ల కాలంలో రూ.లక్ష కోట్లకు చేరుకోవచ్చని ప్రముఖ పెయింట్స్‌ కంపెనీ అక్జో నోబెల్‌ (డ్యూలక్స్‌ బ్రాండ్‌) ఇండియా అంచనా వేసింది. ప్రస్తుతం ఈ పరిశ్రమ పరిమాణం రూ.62,000 కోట్లుగా ఉంది. పెయింట్స్, కోటింగ్స్‌ పరిశ్రమ మార్జిన్‌ గత ఆర్థిక సంవత్సరం మాదిరే ఇంకా మెరుగుపడుతుందని, తయారీలోకి వినియోగించే ముడి సరుకుల ధరలు తగ్గడాన్ని ప్రస్తావించింది. ఈ వివరాలను కంపెనీ తన వార్షిక నివేదికలో పేర్కొంది. పెయింట్స్‌ కంపెనీల మొత్తం తయారీ వ్యయంలో 55–60 శాతం ముడి సరుకులవే ఉంటాయి. ముడి చమురు, ఇతర కీలక సరుకుల ధరలు తగ్గడం 2022–23లో మార్జిన్లు పెరగడానికి దోహదపడినట్టు వివరించింది.  

ఈ రంగం ఆకర్షణీయం..
‘‘ఇటీవలి కాలంలో పలు కొత్త సంస్థలు ప్రవేశించడంతో పెయింట్స్, కోటింగ్స్‌ పరిశ్రమ ఆకర్షణీయంగా మారిందని, కొత్త కంపెనీలు మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, మార్కెటింగ్‌పై ఖర్చు చేస్తూ, మార్కెట్‌ వాటాను పొందే ప్రయత్నంలో ఉన్నాయి. పోటీ పెరగడంతో ఇప్పటికే ఈ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు తమ మార్కెట్‌ వాటాను కాపాడుకోవడం కోసం తమ సామర్థ్యాలను మరింత పెంచుకోనున్నాయి. ఇది ఈ రంగంలోకి మరిన్ని పెట్టుబడులను తీసుకొస్తుంది’’ అక్జో నోబెల్‌ తన నివేదికలో తెలిపింది.

గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్, పిడిలైట్, జేఎస్‌డబ్ల్యూ సంస్థలు కొత్తగా ఈ రంగంలోకి వచి్చనవి కావడం గమనార్హం. ప్రస్తుతం పెయింట్స్, కోటింగ్స్‌ పరిశ్రమలో 75 శాతం మార్కెట్‌ వాటాను ఏషియన్‌ పెయింట్స్, బెర్జర్‌ పెయింట్స్, కన్సాయ్‌ నెరోలాక్, అక్జో నోబెల్‌ ఇండియా కలిగి ఉన్నాయి. ఈ రంగం ప్రధానంగా ఆర్కిటెక్చరల్, ఇండ్రస్టియల్‌ అని రెండు భాగాలుగా ఉండగా, ఇందులో ఆర్కిటెక్చరల్‌ 69 శాతం మార్కెట్‌ వాటాను శాశిస్తోంది. ఇళ్లు, వాణిజ్య భవనాలకు పెయింట్స్‌ ఈ విభాగం కిందకే వస్తాయి. ‘‘పారిశ్రామిక విభాగంలో పెయింట్స్‌కు బలమైన డిమాండ్‌ కనిపిస్తోంది. కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్, ఆటోమొబైల్, అనుబంధ రంగాలు డిమాండ్‌ను నడిపించనున్నాయి’’అని అక్జో నోబెల్‌ తన వాటాదారులకు తెలియజేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement