
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) ప్రెసిడెంట్‌గా ఇన్ఫోసిస్ హైదరాబాద్ సెజ్ సెంటర్ హెడ్ సెంటర్ హెడ్ మనీషా సాబూ ఎన్నికయ్యారు. ఒక మహిళ ఈ బాధ్యతలు చేపట్టడం హైసియా చరిత్రలో ఇదే తొలిసారి. 2022–24 కాలానికి ఆమె ఈ పదవిలో ఉంటారు.
హైసియా సీఎస్‌ఆర్ విభాగానికి మనీషా నేతృత్వం వహిస్తున్నారు. ఐటీ రంగంలో ఆమెకు 20 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హైసియా వైస్ ప్రెసిడెంట్‌గా ఫస్ట్‌సోర్స్ ప్రెసిడెంట్ ప్రశాంత్ నందెళ్ల, జనరల్ సెక్రటరీగా ఆరోప్రో సాఫ్ట్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ రామకృష్ణ లింగిరెడ్డి ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment