తొలుత కనిపించిన ఆటుపోట్ల నుంచి బయటపడుతూ జోరందుకున్న దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 302 పాయింట్లు జంప్‌చేసి 40,485ను తాకగా.. నిఫ్టీ 74 పాయింట్లు ఎగసి 11,908 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్, స్మాల్ క్యాప్ షేర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరిగింది. జాబితాలో రెప్కో హోమ్ ఫైనాన్స్, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఎస్‌హెచ్ కేల్కర్ అండ్ కంపెనీ, జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్, వేలియంట్ ఆర్గానిక్స్ చోటు సాధించాయి. ట్రేడింగ్ వివరాలు చూద్దాం..
రెప్కో హోమ్ ఫైనాన్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం లాభపడి రూ. 209 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 219 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 73,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.1 లక్షల షేర్లు చేతులు మారాయి.
ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 6.4 శాతం జంప్‌చేసి రూ. 305 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 318 వరకూ లాభపడింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.61 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 7.04 లక్షల షేర్లు చేతులు మారాయి.
ఎస్‌హెచ్ కేల్కర్ అండ్ కంపెనీ
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 11 శాతం ర్యాలీ చేసి రూ. 95 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 40,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.31 లక్షల షేర్లు చేతులు మారాయి.
జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.3 శాతం జంప్‌చేసి రూ. 107 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 112 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 62,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 2.27 లక్షల షేర్లు చేతులు మారాయి.
వేలియంట్ ఆర్గానిక్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 15.4 శాతం దూసుకెళ్లి రూ. 3,398 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 3,488 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 46,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 30,500 షేర్లు చేతులు మారాయి.
Comments
Please login to add a commentAdd a comment