హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్పొరేట్ల ఆదాయాలు బాగుంటున్న నేపథ్యంలో వాటితో ముడిపడి ఉన్న మార్కెట్ల పనితీరు కూడా మెరుగ్గానే ఉండగలదని ఎడెలీ్వజ్ మ్యుచువల్ ఫండ్ ఎండీ రాధికా గుప్తా చెప్పారు. కొన్ని విభాగాలు కాస్త అధిక వేల్యుయేషన్లలో ట్రేడవుతున్నప్పటికీ స్థూలంగా మార్కెట్‌ని చూస్తే బబుల్‌లాంటి (బుడగలాగా పేలిపోయే) పరిస్థితేమీ లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అగ్రెసివ్ ఇన్వెస్టర్లు .. ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, బిజినెస్ సైకిల్ ఫండ్స్ మొదలైన వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చని సూచించారు. కాస్త కన్జర్వేటివ్‌గా ఉండే వారు బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ లాంటి హైబ్రిడ్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చని పేర్కొన్నారు.
ప్రస్తుతం తమ ఏయూఎం (నిర్వహణలోని ఆస్తుల పరిమాణం) రూ. 1.40 లక్షల కోట్ల స్థాయిలో ఉండగా, 25–30 శాతం వృద్ధి సాధించేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని రాధిక చెప్పారు. గత ఆరేళ్లలో ఆరు నగరాల నుంచి ప్రస్తుతం 35 పైచిలుకు నగరాలకు కార్యకలాపాలు విస్తరించామని. వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్యను 60కి పెంచుకోవాలని నిర్దేశించుకున్నామని తెలిపారు. సుమారు 15 లక్షలుగా ఉన్న ఫోలియోలను 30–40 లక్షలకు పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు.
సిప్‌లు పెరగడమనేది దేశీ మార్కెట్లకు మేలు చేస్తోందని, విదేశీ నిధులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని ఆమె చెప్పారు. ఇన్వెస్టర్లు అసాధారణ రాబడులకు హామీలనిచ్చే సాధనాల విషయంలో సదా అప్రమత్తంగా ఉండాలని, పనితీరు మాత్రమే కాకుండా సంస్థ పటిష్టతను కూడా చూసుకోవాలని రాధిక సూచించారు. భారత ఎకానమీ వృద్ధి చెందడమనేది కేవలం ఏదో ఒక రంగంపై ఆధారితమైనది కాకుండా వివిధ రంగాలవ్యాప్తంగా ఉంటుందనే విషయాన్ని రిటైల్ ఇన్వెస్టర్లు గుర్తించి, తదనుగుణంగా పెట్టుబడులు పెట్టాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment