కోవిడ్-19 సెకండ్ వేవ్ తర్వాత ఇండియన్ స్టాక్ మార్కెట్ రాకెట్ వేగంతో పరిగెడుతుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనా సూచీలు జీవన కాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీంతో మదుపరులకు గతంలో ఎన్నడూ లేని రీతిలో లాభాలు వస్తున్నాయి. ఒక మల్టీబ్యాగర్ స్టాక్ కంపెనీ మాత్రం మదుపరులకు కళ్లు చెదిరే లాభాలను తెచ్చి పెడుతుంది. 2021లో రియల్ ఎస్టేట్ కంపెనీ రాధే డెవలపర్స్ కంపెనీ షేర్ ధర 5 నెలల కాలంలోనే ఊహించని స్థాయిలో దూసుకెళ్తుంది.
ఈ ఏడాది జులై 1 రూ.9.84లుగా ఉన్న షేర్ ధర నేడు రూ.338.15లకు చేరుకుంది. అంటే, 5 నెలల కాలంలోనే 34 రేట్లకు పైగా రాధే డెవలపర్స్ షేర్ ధర పెరిగింది. జులై 1న రూ.1,00,000 విలువ గల రాధే డెవలపర్స్ షేర్లు కొని ఉన్న వారికి ఇప్పుడు రూ.34 లక్షలకు పైగా లాభం వచ్చేది. చాలా మందికి స్టాక్ మార్కెట్ మీద ఒక అపోహ ఉంది. ఇందులో పెట్టుబడి పెట్టిన వారు నష్టపోతారు అని నమ్మకం!. కానీ, నిపుణులు మాత్రం పెట్టుబడులను చిన్న, చిన్న మొత్తాలని ప్రారంభించాలని, ఎప్పటికప్పుడు మార్కెట్ పరిశోదన చేయలని సూచిస్తున్నారు. అలాంటి వారు మాత్రమే, అధిక లాభాలను గడిస్తారని పేర్కొంటున్నారు.
(చదవండి: కార్ డ్రైవ్ చేస్తూ వీడియో గేమ్ ! ఎలన్ మస్క్ ఏమైంది నీకు?)
Comments
Please login to add a commentAdd a comment