![Nestle India Declares Interim Dividend Of Rs 27 For 2023 - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/13/NESTLE.jpg.webp?itok=LjAutwuY)
న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా తాజాగా ఒక్కో షేరుకి రూ. 27 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. బుధవారం నిర్వహించిన 64వ వార్షిక సమావేశంలో కంపెనీ బోర్డు ఇందుకు ఆమోదముద్ర వేసింది. డివిడెండ్ చెల్లింపునకు రికార్డ్ డేట్ ఏప్రిల్ 21కాగా.. వాటాదారులకు మే 8న ప్రతీ షేరుకీ రూ. 10 చొప్పున చెల్లించనుంది.
కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే. రూ. 10 ముఖ విలువగల 9.64 కోట్లకుపైగా షేర్లతోకూడిన మొత్తం చెల్లించిన మూలధనంపై డివిడెండును ప్రకటించింది. కాగా.. ప్రస్తుత ఏడాది(2023) తొలి త్రైమాసిక(జనవరి–మార్చి) ఫలితాలను ఈ నెల 25న ప్రకటించనుంది. 2022 అక్టోబర్ 31న కంపెనీ షేరుకి రూ. 120 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.
ఎన్‌ఎస్‌ఈలో నెస్లే ఇండియా షేరు 1 శాతం నీరసించి రూ. 19,460 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment