సార్వత్రిక ఎన్నికల్లో భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే మూలధన లాభాల పన్ను విధానంలో మార్పులు తీసుకురావాలని ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) యోచిస్తోందన్న వార్తలు వైరల్‌గా మారాయి. వాటిని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు.
ఆర్థికంగా అన్ని తరగతుల వారికి ఒకే విధమైన పన్ను అమలయ్యేలా యూనిఫామ్ విధానాన్ని తీసుకురావాలని ఐటీ శాఖ యోచిస్తోందనే వార్తలు వివిధ సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం వైరల్‌గామారాయి. ప్రముఖ న్యూస్ ఛానెల్‌కు సంబంధించిన ట్విటర్ ఖాతాలో ఈ మేరకు పోస్టులు వెలిశాయి. దాంతో ఆర్థికమంత్రి నిర్మాలాసీతారామన్ తన ‘ఎక్స్’ ఖాతాలో స్పందించారు. ‘ఈ వార్తలు ఎలా వస్తున్నాయో ఆశ్చర్యంగా ఉంది. అలా ఏదైనా అప్‌డేట్ ఉందని తెలిస్తే సంబంధిత శాఖతో ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలి. ఇలా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంలేదు. లోక్‌సభ ఎన్నికల ముందు ఇలాంటి వార్తలు వస్తుండడం ఇబ్బందిగా ఉంది’ అని వివరణ ఇచ్చారు.
ఇదీ చదవండి: పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ
వైరల్ అయిన వార్తకు సంబంధించిన పోస్టులు శుక్రవారం మార్కెట్ సమయంలోనే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దానికితోడు స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుపై అనుమానాలు, ఫెడ్ కీలక వడ్డీరేట్లను తగ్గించడంలో మరికొంత సమయం పట్టే అవకాశం ఉండడంతో మార్కెట్లు నిన్న భారీగా నష్టపోయాయి. తాజాగా ఆర్థికమంత్రి స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఎలాంటి అంతర్జాతీయ అనిశ్చితులు ఏర్పడకపోతే సోమవారం మార్కెట్లు లాభాల్లోకి వెళుతాయని నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment