BSNL OTT Subscription Rate Reduced To 50 Percentage, Check Latest Price Details Inside | Sakshi
Sakshi News home page

ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను సగానికి తగ్గించిన ప్రభుత్వ సంస్థ

Published Tue, Apr 30 2024 11:35 AM | Last Updated on Tue, Apr 30 2024 12:33 PM

OTT subscription rate reduced to 50 percentage of BSNL

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఉన్న క్రేజ్‌ అంతాఇంతా కాదు. దాదాపు చాలా టెలికాం కంపెనీలు ప్రత్యేకంగా ఓటీటీ సేవలందిస్తున్నాయి. అందులో భాగంగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా ఓటీటీని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే తమ ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్క్రైబర్లకు అందించే సినిమాప్లస్‌ ఓటీటీ ప్యాకేజీ ప్రారంభ ధరను సంస్థ తగ్గించింది.

ఈ ప్రారంభ ప్యాక్‌ ధర గతంలో నెలకు రూ.99గా ఉండేది. దాన్ని రూ.49కు తగ్గిస్తూ కంపెనీ ఇటీవల ప్రకటించింది. ఇందులో లయన్స్‌గేట్‌, షెమరూమీ, హంగామా, ఎపిక్‌ ఆన్‌ ఓటీటీల్లోని కంటెంట్‌ను వీక్షించవచ్చు. దీంతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో రెండు ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. నెలకు రూ.199 సబ్‌స్క్రిప్షన్‌తో జీ5, సోనీలివ్‌, యప్‌టీవీ, డిస్నీ+ హాట్‌స్టార్‌తో కూడిన ఫుల్‌ ప్యాక్ ఓటీటీ ప్యాకేజీ అందిస్తోంది.

నెలకు రూ.249 చెల్లిస్తే బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రీమియం ప్లాన్‌కు అప్‌గ్రేడ్‌ కావచ్చని సంస్థ తెలిపింది. ఇందులో జీ5, సోనీ లివ్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌, యప్‌టీవీ, లయన్స్‌గేట్‌, షెమరూమీ, హంగామా, వంటి ఓటీటీలను ఫ్రీగా చేసేయొచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement